ఇండియా కూటమిలో వైసీపీ పార్టీ చేరుతుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో వైసీపీ పార్టీ ధర్నా చేసిన తరుణంలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కూడా వైసీపీ పార్టీకి మద్దతు ఇచ్చాయి. దీంతో ఇండియా కూటమిలో వైసీపీ పార్టీ చేరుతుందని జోరుగా చర్చ చోటు చేసుకుంది. అయితే.. దీనిపై స్వయంగా జగన్ క్లారిటీ ఇచ్చారు. ఇండియా కూటమిలో చేరతారా అనే అంశంపై వైఎస్ జగన్ మాట్లాడుతూ... పెద్ద బాంబే పేల్చారు.
కాంగ్రెస్ పార్టీ పరువు తీసేలా మాట్లాడి.. ఇండియా కూటమిలో వైసీపీ పార్టీ పై తన అభి ప్రాయాన్ని చెప్పకనే చెప్పారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీలో ఫోటో, వీడియో గ్యాలరీలు ఏర్పాటు చేశామని.... ఇండియా కూటమిలో కొన్ని పార్టీలు వచ్చాయని వివరించారు జగన్. కానీ కాంగ్రెస్ పార్టీ రాలేదని ఆగ్రహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు ఎలా టచ్ లో ఉన్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాలని నిలదీశారు జగన్. బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ncp ఇలా అన్ని పార్టీలను ధర్నా కు పిలిచామని చెప్పారు.
కానీ కొన్ని పార్టీలు మాత్రమే వచ్చాయన్నారు. మణిపూర్ లో అల్లర్లు దాడులు మీద స్పందించే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎందుకు రియాక్ట్ అవలేదో కాంగ్రెస్ పార్టీ చెప్పాలని నిలదీశారు. అటు ప్రతిపక్ష హోదా పై వైఎస్ జగన్ మాట్లాడుతూ...ప్రభుత్వం చెబుతున్న అసత్యాలకు సమాధానం అసెంబ్లీలో చెప్పాలని తెలిపారు. అసెంబ్లీలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనేవి ఉంటాయన్నారు.
ప్రతిపక్షాన్ని గుర్తిస్తే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాల్సి ఉంటుందని వివరించారు. ప్రతిపక్ష నాయకుడిగా గురిస్తే సభా నాయకుడి తర్వాత అంత సమయం ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అది హక్కు అన్నారు. అలా చేస్తే ప్రశ్నించే గొంతు విప్పే పరిస్థితి ఉంటుందని వివరించారు. అందుకే అలా అడగకుండా ఇలా చేస్తున్నారని నిప్పులు చెరిగారు జగన్.