మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వైసిపి పార్టీకి.. వరుసగా షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్క నేత వైసీపీని వీడుతున్నారు. ఏపీలో వైసీపీ పార్టీకి దారుణంగా సీట్లు రావడంతో.. అసలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదన్నట్లుగా బయటకు వస్తున్నారు నేతలు. చాలామంది అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. కొంతమంది మాత్రమే బహిరంగంగా అనే ప్రకటించి బయటకు వస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైపు అడుగులు వేస్తున్నారు నేతలు.
తెలుగుదేశం, జనసేన లేదా బిజెపి పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే.. కిలారి రోశయ్య లాంటి నేతలు వైసిపి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆయన జనసేనలోకి వెళ్తారట. అయితే ఈ బాధ నుంచి తీరకోక ముందుకే వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జాకియ ఖానమ్... జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఏ క్షణమైనా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి.. తెలుగు దేశం పార్టీలో వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జాకియ ఖానమ్ దూకే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజాగా శాసనమండలి లాబీలో మంత్రి నారా లోకేష్ ను కలిశారు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జాకియ ఖానమ్. ఇప్పటికే మంత్రి ఫరూఖ్ తో భేటీ అయిన జాకియ ఖానమ్.. తాజాగా మంత్రి నారా లోకేష్ ను కలిశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సహా వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్టసభల్ని బహిష్కరించినా, మండలికి వస్తున్నారు జాకియ ఖానమ్.
ఇక ఇవాళ మంత్రి నారా లోకేష్ ను కుటుంబ సభ్యులతో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు జాకియ ఖానమ్. దీంతో త్వరలో తెలుగుదేశం లో జాకియ ఖానమ్ చేరుతున్నారంటూ పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. వాస్తవానికి తెలుగు దేశం పార్టీకి శాసన మండలిలో ఎక్కువగా బలం లేదు. అందుకే వైసీపీ ఎమ్మెల్సీలను లాగేందుకు కూటమి సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.