ఏపీ: చంద్రబాబును కొట్టిన పెద్దిరెడ్డి.. మాజీ సీఎం సంచలన వీడియో..!

frame ఏపీ: చంద్రబాబును కొట్టిన పెద్దిరెడ్డి.. మాజీ సీఎం సంచలన వీడియో..!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య వైర్యం ఉందని కేవలం ఈ వైర్యం ఇప్పటిది కాదని కాలేజీ రోజుల్లో చదువుకునే నాటిదంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున ప్రెస్మీట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చక్రం తిప్పగలిగిన నాయకులను కూడా చెప్పవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకే చెందిన విరికి ఒకరు అంటే ఒకరు అసలు గిట్టడం లేదు. ఒకరు అధికారంలో ఉన్నప్పుడు మరొకరి పైన కక్ష సాధింపు వంటివి చేస్తూనే ఉన్నారు.

అయితే తాజాగా చంద్రబాబు, పెద్దిరెడ్డి మధ్య వివాదం తెరపైకి మరొకసారి వినిపిస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటన పైన అధికార పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ విషయం పైన రాష్ట్ర డీజీపీని రంగంలోకి దింపి మరి పరిశీలించమని తెలియజేసింది. అయితే ఈ అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది కాదని కావాలనే చేశారని ప్రభుత్వం అనుమానిస్తున్నట్లు తెలియజేస్తుంది. ఈ ఘటనకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఇతనీ కుమారుడు మిథున్ రెడ్డి హస్తము ఉందని ప్రచారం చేస్తున్నారు.

ఈ వ్యవహారంతో తాజాగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందిస్తు.. చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పైన కక్ష సాధింపు చేస్తున్నారని ఇద్దరి మధ్య రాజకీయ వైర్యమే కాదు గతంలో జరిగిన వ్యక్తిగత గొడవల వల్లే ఇలా చేస్తూ ఉంటారని తెలిపారు. చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి ఇద్దరు ఓకే జిల్లాకు చెందిన వారే కాదు ఒకే సమయంలో చదువుకున్నారని అది కూడా ఎస్వీ యూనివర్సిటీలో చదువుకునే రోజులలో ఇద్దరు కూడా స్టూడెంట్ లీడర్ గా కొనసాగారు ఆ సమయంలో ఇద్దరి మధ్య ఒక గొడవ జరిగిందట.. ఆ సమయంలో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టాడట.. అప్పటినుంచి అతని మీద పగ పెంచుకొని ఇప్పటికే కక్షలు సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారని మాజీ సీఎం తెలియజేశారు. ఎలాగైనా పెద్దిరెడ్డి కుటుంబాన్ని తొక్కేయాలని చంద్రబాబు ఆలోచిస్తూ ఉంటారని అందుకే ఎలాంటివి జరిగినా కూడా ఆయననే టార్గెట్ చేస్తూ ఉంటారని తెలిపారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: