బ‌డ్జెట్ బెంగ‌: చంద్ర‌బాబు ఎందుకు వెన‌క్కి త‌గ్గారు?

Reddy P Rajasekhar
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక పథకాలు ఇప్పటికే అమలు కాగా అన్న క్యాంటీన్లు, మహిళలకు ఫ్రీ బస్ పథకాలు ఆగష్టు నెల 15వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. ఇప్పటివరకు అమలు చేసిన పథకాలలో పింఛన్ల పెంపు మాత్రమే ఆర్థికంగా భారమైన పథకం కావడం కొసమెరుపు.
 
అయితే ఏపీలో రెండు నెలల తర్వాతే బడ్జెట్ ను ప్రవేశపెడతామని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆర్థిక పరిస్థితిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ కనీస ఖర్చులకు కూడా రాష్ట్రం అప్పు చేసే పరిస్థితికి దిగజార్చిందని చంద్రబాబు వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రం వెనుకబడిన రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి నెలకొందని బాబు పేర్కొన్నారు.
 
ఈ కారణాల వల్లే బడ్జెట్ ను ఇప్పటికిప్పుడు ప్రవేశపెట్టడం సాధ్యం కాదని చంద్రబాబు తేల్చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్న సాధ్యం కావడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీ ఖజానాలో నిధులు లేవని ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు ఇవ్వాల్సి ఉందని చంద్రబాబు నాయుడు వెల్లడించడం కొసమెరుపు. అప్పులు చేసి ఏపీని ముందుకు నడిపించాలని భావించడం లేదని చంద్రబాబు తెలిపారు.
 
అయితే చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వచ్చే 60 రోజుల్లో సంపద సృష్టించే దిశగా అడుగులు వేస్తానని చంద్రబాబు చెబుతున్నా ఆయన కామెంట్లు నమ్మశక్యంగా అనిపించడం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వైసీపీని నిందించడం వల్ల చంద్రబాబుకు మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బడ్జెట్ విషయంలో వైసీపీ నుంచి బాబు తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: