బడ్జెట్ బెంగ: విపక్షంగా వైసిపి విఫలమైందా.?
- పులిలా ఒక్కడివే ప్రభుత్వంపై పంజావిసురు.
- ప్రశ్నించకుంటే వైసిపి పార్టీ ఖాతమే.!
ఏపీ రాష్ట్రంలో ఎన్నికలంటేనే చాలా డిఫరెంట్ గా జరుగుతూ ఉంటాయి. ఏ పార్టీ గెలిచినా పూర్తిస్థాయి మెజారిటీ సాధిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆపోజిట్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు..అలా ఏపీలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాని 151 సీట్లు సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ టైంలో చంద్రబాబు టీడీపీ ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంపై విపరీతంగా కొట్లాట చేసింది. చివరికి చంద్రబాబును హేళన చేసి అసెంబ్లీ సాక్షిగా విపరీతంగా బాధపెట్టారు. అయినా చంద్రబాబు మాత్రం ప్రశ్నించడం మానేయలేదు. చివరికి అసెంబ్లీ సాక్షిగా నేను పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పటం, ఆ విధంగానే ఆయన ముందుకు వెళ్లి ప్రజల్లో తిరుగుతూ చివరికి అధికారంలోకి వచ్చి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టాడు..
జగన్ చేయాల్సిన పనులు:
అధికారంలో ఉంటేనే ప్రజా తరుపున మాట్లాడతాను, లేకుంటే మాట్లాడను అనే ధోరణి జగన్ వదిలిపెట్టాలి. ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసి బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే చివరికి పార్టీ కూడా లేకుండా పోతుంది. ప్రతిపక్షం అంటే ప్రశ్నించే గొంతు, ఒక్కరున్నా చాలు ప్రజల వైపు నిలబడవచ్చు. ఆ విధంగా జగన్ ఉంటే మాత్రం తప్పకుండా రాబోవు ఎలక్షన్స్ వరకు గట్టి లీడర్ గా ఎదగవచ్చు. ఇప్పటికే గత వైసిపి ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పులను ఎత్తిచూపుతూ శ్వేతా పత్రాలు విడుదల చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. కానీ వైసీపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఎదురు దాడి జరగలేదు. దీనికి తోడు అసెంబ్లీ సమావేశాలకు సోమవారం ఒక్కరోజు మాత్రమే వచ్చి ఆ తర్వాత బైక్ కట్ చేశారు. అంతేకాకుండా ప్రతిరోజు సమావేశాలకు వచ్చి వారు అమలు చేస్తానన్నటువంటి పథకాలు నెలరోజులు గడిచిన అమలు చేయకపోవడంపై ప్రశ్నించాలి. శ్వేతా పత్రం విడుదల చేసిన చంద్రబాబుకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలి. ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలిసేలా చెప్పాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాంటి పథకాలు అమలు చేస్తానని చెప్పిందో, ఆ పథకాలు తొందరగా అమలయ్యేలా ప్రతిపక్షం ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి. ప్రజల వైపు నిలబడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి రాబోవు రోజుల్లో పార్టీని గట్టెక్కించుకోగలరు. లేదంటే ఆయన పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.