బడ్జెట్ బెంగ:చంద్రబాబు వర్సెస్ జగన్!
•అధికారంలోకి రాగానే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన జగన్
* చంద్రబాబు రాజకీయ అనుభవం ఏమైంది..
(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)
2019 ఎన్నికలలో వైసీపీ ఊహించని విధంగా 151 సీట్లు కైవసం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఒక పార్టీ అందులోను ఈ రేంజ్ లో సీట్లు సాధించడం అంటే నిజంగా ఒక రికార్డు అనే చెప్పాలి. ఆ రికార్డును జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారు.. అయితే ఆ తరువాత ఎలాగైనా సరే జగన్ ను ఓడించి అధికారంలోకి రావాలని బిజెపి, జనసేన తో పొత్తు పెట్టుకుని 175 స్థానాలలో కూటమితో సహా 164 సీట్లు కైవసం చేసుకుంది టిడిపి. అయితే ఇక్కడ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల తేడాలను ప్రజలు గుర్తు చేస్తున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళ్తే , అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అయితే ఆయన గత టిడిపి ప్రభుత్వాన్ని విమర్శించలేదు . ప్రజల పరిపాలన ఏ విధంగా చేయాలి అనే అంశాలపైనే ముందడుగు వేశారు. అంతేకాదు రాష్ట్రం దివాలా తీసే పరిస్థితుల్లో ఉందని కూడా ఆయన ఏరోజు చెప్పలేదు.. 2014 ఎన్నికలలో టిడిపి అధికారంలోకి వచ్చింది అప్పుడు కూడా ప్రభుత్వం అప్పుల్లోనే కూరుకు పోయిందని వార్తలు వినిపించాయి. కానీ ఆ మాటలు ఎప్పుడూ కూడా 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మాట్లాడలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడుని దోషిగా జగన్ చూపించే ప్రయత్నం చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి విరుద్ధం అని చెప్పాలి.
కొన్ని దశాబ్దాల రాజకీయ అనుభవం ఉండి ఒక యంగ్ నాయకుడిపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్న పనికి అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రావడమే ఆలస్యం జగన్ పై తన అక్కసు ను చూపించుకుంటున్నాడు ముఖ్యంగా పరిపాలన చేపట్టకుండా జగన్ ను ద్వేషించడమే పనిగా పెట్టుకుని అధికారంలోకి వచ్చినట్లు తెలుస్తోందని కొంతమంది ప్రజలు కామెంట్లు చేస్తున్నారు.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే జగన్ ను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు మొన్న అసెంబ్లీ సమావేశాలలో కూడా జగన్ ను దోషిగా చూపించే ప్రయత్నాలు చేశారు.ఇలా ప్రతి విషయంలో కూడా విమర్శించారు. ఇక అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న పనులను బట్టి చూస్తే ఇది రాజకీయంగా మంచిదే అయిన రాష్ట్రానికి మంచిది కాదని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి చంద్రబాబు ఇప్పటికైనా తన తీరును మార్చుకొని రాష్ట్ర అభివృద్ధి వైపు అడుగులు వేస్తారేమో చూడాలి.