బడ్జెట్ బెంగ: నిజంగానే ఖజానాలో నిధుల్లేవా?
మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనే ప్రశ్నకు వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే ఆయన టార్గెట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఖజానాలో నిధులు ఉన్నా పింఛన్ల పెంపు కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. గత నెలలో 7,000 రూపాయల పింఛన్ పంపిణీ చేయడం వల్ల ఆర్థికంగా బడ్జెట్ భారం పెరిగిందని చెప్పవచ్చు.
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఉద్యోగుల పెన్షన్లు, ఇతర కారణాల వల్ల ఖజానాలో ఎంత ఉన్నా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. మరోవైపు సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం తల్లికి వందనం స్కీమ్ కోసమే ఏకంగా 15000 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయని చెప్పవచ్చు.
ప్రజలు సంతృప్తి పడే స్థాయిలో పథకాల అమలు జరగకపోయినా ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. సూపర్ సిక్స్ హామీల అమలే బడ్జెట్ విషయంలో వెనుకడుగుకు కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు పథకాల అమలును ఆలస్యం చేస్తే మాత్రమే ఇబ్బందులు పడక తప్పదని చెప్పవచ్చు. వైసీపీకి కూటమి నేతలు తక్కువ సమయంలోనే విమర్శించే అవకాశాలు అయితే ఇస్తున్నారని చెప్పవచ్చు. చంద్రబాబు సంక్షేమంపై మాత్రమే ఫోకస్ పెట్టి అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేసినా ఇబ్బందులు తప్పవు.