జనసేన ఎంపీ గెలుపె వెనక రేవంత్‌రెడ్డి.. ఎవ్వరికి తెలియని టాప్ సీక్రెట్..?
అయితే బాలశౌరి వైసిపి ఎంపీలకు కూడా కొందరికి ఫోన్ చేసి ముఖ్యమంత్రి కదా ఏదైనా పని ఉంటుంది మనకు వెళదామని పురమాయించారు. ఈ విషయం తెలిసిన జగన్ బాలశౌరిపై ఆగ్రహంతో ఊగిపోయారు. రేవంత్ రెడ్డి పిలిస్తే విందుకు ఎందుకు వెళ్లావు .. పైగా పార్టీ ఎంపీలను కూడా రమ్మని తీసుకువెళతావా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసారట. ఇది కొందరు పార్టీ నేతలు సమక్షంలోనే జరిగింది. జగన్ అన్న మాటలకు బాలశౌరి తీవ్రంగా హర్ట్ అయ్యారు. అప్పుడే అయినా పార్టీలో ఉండటం అనవసరం అన్న నిర్ణయానికి వచ్చేసారు.
ఈ క్రమంలోనే రెండు మూడు నెలల పాటు అవమానంతోనే పార్టీలో ఉన్న బాలశౌరి కచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్లిపోయారు.. జనసేన నుంచి అదే బందరు ఎంపీ సీటు తెచ్చుకొని ఘనవిజయం సాధించారు. అలా రేవంత్ రెడ్డి విందుకు ఆహ్వానించకపోతే జగన్ బాలశౌరిని తిట్టి ఉండే వారే కాదు.. బాలశౌరి పార్టీ మారకుండా అదే వైసీపీ నుంచి మళ్లీ బందరులోనే పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయి ఉండేవారేమో..! అలా పరోక్షంగా రేవంత్ రెడ్డి బాలశౌరి జనసేనలోకి వెళ్ళటానికి ఆయన రెండోసారి ఎంపీగా గెలవడానికి కారణమయ్యారు.