గోదావరి వైసీపీలో పోస్టులు ఖాళీ... వాంటెడ్ నోటిఫికేషన్ వేస్తావా జగన్..?
అలాగే నరసాపురం నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన గూడూరి ఉమాబాల .. రాజమండ్రి నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన గూడూరు శ్రీనివాస్ కూడా రాజకీయాల్లో కొనసాగే ఉద్దేశంలో లేరు. దీంతో వైసీపీలో ఈ పోస్టులన్నీ ఖాళీ అయిపోతున్నాయి. అలాగే రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా ఈసారి అక్కడ పోటీ చేయరు. దీంతో అక్కడ కూడా ఇన్చార్జి పదవి ఖాళీ కానుంది. ఏలూరు పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయిన కారుమూరి సునీల్ కుమార్ .. కాకినాడ పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ మాకు ఎంపీ స్థానాలు వద్దే వద్దని చెబుతున్నారు.
ఇక అటు తూర్పుగోదావరి జిల్లాలోనూ చాలా చోట్ల వైసిపి నుంచి పోటీ చేసిన వారంతా ఇకపై క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగకుండా ఉండటమో ? లేదా వైసిపికి గుడ్ బై చెప్పి దూరంగా ఉండటం చేసే ప్లాన్ లో ఉన్నారు. ఏది ఏమైనా మరో ఏడాదిలో గోదావరి వైసీపీలో చాలా పోస్టులు ఖాళీ అయిపోనున్నాయి. మరి జగన్ వీళ్ల భర్తీకి ఏదైనా వాంటెడ్ నోటిఫికేషన్ వేసుకుంటారేమో ? చూడాలి.