షర్మిల: జగన్ పై సంచలన ట్విట్.. మరోసారి బయటపడ్డ వైర్యం..!.
ఢిల్లీలో వైసిపి చేపట్టినటువంటి ధర్నాకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు సమాధానం తెలియాలి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాగా ..ఈ విషయం పైన షర్మిలను కూడా తప్పుపట్టారు.. తాజాగా షర్మిల కూడా ఈ విషయం పైన అసలు మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు.. పార్టీ ఉనికి కోసమే ఢిల్లీలో కప్పట నాటకం ఆడారుగా.. వ్యక్తిగత హత్య రాజకీయ రంగు పులిమినందుక.. లేకపోతే ఐదేళ్లపాటు బిజెపితో స్నేహబంధం పెట్టుకోవడం విభజన హక్కులను ప్రత్యేక హోదాను బిజెపికి తాకట్టు పెట్టినందుకా అంటూ ఆమె ప్రశ్నించింది..
క్రిస్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురించి మాట్లాడకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బిజెపికి మద్దతు ఇచ్చింది మీరే కదా అంటూ షర్మిల సైతం జగన్ ని ప్రశ్నించింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించిన మతతత్వ బిజెపి పార్టీకి సైతం జై కొట్టింది మీరే కదా అంటూ ఫైర్ అయ్యింది.. మణిపూర్ ఘటన పైన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉంటే మీ నుంచి ఎలాంటి సంఘీభావం రాలేదు అంటూ షర్మిల ప్రశ్నించింది.. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు అంటు షర్మిల ఒక కౌంటర్ వేసింది. దీంతో మరొకసారి అటు అన్నా చెల్లెల మధ్య వైర్యం బయటపడిందని పలువురు నేతలు తెలుపుతున్నారు.