ఏపీ : వారం రోజులే గడువు.. టెట్ అభ్యర్థులకు బిగ్ అలెర్ట్..!!

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మొదటి సంతకం డీఎస్సీ ఫైలుపై చేసింది.రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు జులై 2న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.టెట్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 3వ తేదీతో గడువు ముగియనుంది. దరఖాస్తు గడువు పొడిగింపు ఉండదని తాజాగా పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 3వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే ఇప్పటి వరకూ టెట్ పరీక్షకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ టెట్ పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. టెట్ పరీక్షలు పూర్తికాగానే నవంబర్ 3 న ఫలితాలు వెల్లడించనున్నారు.. 

ఇదిలా ఉంటే టెట్ పూర్తి అయిన మూడు నెలలకు డిఎస్సీ పరీక్షను కూడా నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా పోస్టులు లెక్క తేల్చి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.ఇప్పటికే గత ప్రభుత్వం ఇచ్చిన 6100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం రద్దు చేసింది.ఇదిలా ఉంటే రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు టెట్ పరీక్ష కోసం ఉచిత కోచింగ్ ను అందిచనున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ ఎం డి ఫరూక్ శుక్రవారం అమరావతి నుంచి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్(బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు మరియు జైనులు తదితర మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.ఏపీ- టెట్ 2024 కు ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉర్దూ మరియు తెలుగు మీడియం లో శిక్షణ ఇవ్వనున్నామని వారు పేర్కొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: