రాజకీయాల్లో కింగ్ మేకర్! గాంధీ గారి కోడలా మజాకా!

Purushottham Vinay

• కాంగ్రెస్ లెగసీని సుధీర్ఘ కాలం పాటు నిలబెట్టిన ఘనత సోనియా గాంధీది! 

• 125 ఏళ్ళ చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి అతి ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా నిలిచి రికార్డులు సృష్టించిన సోనియా గాంధీ!


ఢిల్లీ - ఇండియా హెరాల్డ్: సోనియా గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశం మొత్తానికి ఆమె సుపరిచితురాలు. ఆమె కుటుంబంలో ఏకంగా ఇద్దరు భారత మాజీ ప్రధాన మంత్రులు ఉన్నారు. ఇది నిజంగా సూపర్ రికార్డ్ అనే చెప్పాలి.భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కోడలు ఇంకా మరో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య ఈమె. 1991లో రాజీవ్ గాంధీ హత్య తరువాత సుధీర్ఘ కాలం పాటు భారత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఘనత ఈవిడ సొంతం. రాజీవ్ గాంధీ మరణం తరువాత కాంగ్రెస్ నాయకులు ఆమెను ప్రధాని పదవి తీసుకోమని అడుగగా అందుకు ఆమె నిరాకరించారు. 1997లో రాజకీయ రంగప్రవేశం చేసిన సోనియా గాంధీ 1998లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నికయారు.2004 నుంచి సోనియా గాంధీ లోక్ సభలోని యునైటెడ్ ప్రాగ్రెసివ్ ఎలియస్స్ కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబరు 2010లో వరుసగా నాలుగోసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికవడంతో 125 ఏళ్ళ చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి అతి ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా వ్యవహరించిన వారిగా సోనియా గాంధీ చరిత్ర సృష్టించారు. 


రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కోడళ్లలో సోనియా గాంధీకి ఉన్న ట్రాక్ రికార్డ్ మరెవరికి లేదనే చెప్పాలి. అయితే ఆమె విదేశీయురాలు కావడం ఎన్నో వివాదాలకు కారణమైంది. తన ఇటలీ దేశానికి చెందిన వ్యాపారవేత్త ఒట్టివో కాట్రొచితో స్నేహం కూడా వివాదాలకు కారణమైంది. ఒట్టొవో బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలని ఎదుర్కొన్నారు. ఎన్ని వివాదాలు ఎదురయ్యినా కానీ ఏమాత్రం వెనక్కి తగ్గని స్ట్రాంగ్ లేడీ పొలిటిషయన్ గా తన ముద్రని వేసుకున్నారు సోనియా గాంధీ. ఈమెకు ముందు కాంగ్రెస్ కు కొంతమంది విదేశీయులు అధ్యక్షులుగా ఉన్నా స్వాతంత్ర్యం తరువాత ఈమే మొదటి విదేశీ అధ్యక్షురాలుగా అయ్యారు. 


గాంధీ కుటుంబానికి కోడలుగా వచ్చి గాంధీ వంశాన్ని నిలబెట్టిన లేడీ టైగర్ గా సోనియా గాంధీ చరిత్రలో నిలిచిపోతుంది. అత్త ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ గాంధీ మరణాల తరువాత కూడా ఏమాత్రం క్రుంగిపోకుండా భయపడకుండా గాంధీ వంశానికి ఉన్న పవర్ ని సుధీర్ఘ కాలం పాటు కొనసాగించింది సోనియా గాంధీ.ప్రస్తుతం సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ చాకులా రాజకీయాల్లో రాడ్డు దేలాడు. ఎన్ని అవమానాలు ఎదురోచ్చిన తన తల్లిలా ధైర్యంగా ఎదురుకుంటూ ముందుకి దూసుకుపోతూ రోజు రోజుకి ప్రజల్లో అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకొని ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: