బాలయ్య భార్య వసుంధరకు ఎవరూ సాటిరారుగా.. బాలయ్య గెలుపులో ఈమెకు వాటా ఇవ్వాల్సిందే!

Reddy P Rajasekhar
నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల్లోని స్టార్ హీరోలలో ఒకరిగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. బాలకృష్ణ మాస్, క్లాస్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. బాలయ్య గత మూడు సినిమాలు ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదనే సంగతి తెలిసిందే. బాలయ్య పారితోషికం కూడా ఒకింత భారీ రేంజ్ లో ఉండటం కొసమెరుపు.
 
బాలయ్య భార్య వసుంధర గురించి కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భర్త సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా అండగా నిలబడుతూ వసుంధర ప్రతి విషయంలో బాలయ్యకు సపోర్ట్ చేశారు. హిందూపురం రైతు కూలీలతో కలిసి వసుంధర ఎన్నికల ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య హిందూపురం నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించడంలో వసుంధరకు సైతం వాటా ఇవ్వాల్సిందేనని చెప్పవచ్చు.
 
వసుంధర మీడియాకు సైతం దూరంగా ఉంటారు. అయితే ప్రశంసల పరంగా పరంగా మాత్రం ఆమె అంతకంతకూ ఎదుగుతున్నారు. ఆమె చేతితో ఏ నిర్మాతకు అయినా డబ్బు ఇస్తే సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. వసుంధర మనస్సు మంచిదని ఇంటికి వచ్చిన అతిథులను ఆమె ఎంతో గౌరవిస్తారని కూడా ఇండస్ట్రీలో అందరూ భావిస్తారు.
 
వసుంధర కొడుకును, కూతుళ్లను ప్రయోజకులను చేయడంలో సైతం ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించారు. మోక్షజ్ఞ సినిమాల్లోకి మరికొన్ని నెలల తర్వాత ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో మోక్షజ్ఞ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఆరోజు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి సంబంధించి అధికారికంగా స్పష్టత రానుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటంలో వసుంధరకు ఎవరూ సాటిరారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బాలయ్య సైతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసే పనిలో బిజీ అయ్యారనే సంగతి తెలిసిందే.
 
 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: