అమెరికా సంచలనం: ఇకనైనా డ్రగ్ మాఫియా తగ్గుతుందా?
టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్ పాసో సిటీ శివారులోని చిన్న ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన అదే విమానంలో ఉన్న డ్రగ్ లార్డ్ ఎల్ చాపో కుమారుడు ఎల్ చాపో గుజ్మాన్(38)ని పోలీసులు అరెస్ట్ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. దశాబ్ధాలుగా జంబాడా అరెస్ట్ కోసం అమెరికా ప్రయత్నిస్తోంది. అతి జాడ చెప్తే ఏకంగా రూ.125 కోట్లు ఇస్తామని నజరానా కూడా ప్రకటించింది.
అమెరికాలోకి వందల కోట్ల డాలర్ల విలువైన ఫెంటానిల్, మెథాంఫెటమైన్ డ్రగ్స్ ని సరఫరా చేస్తూ అమెరికా యువతను మాదక ద్రవ్యాల మత్తులో ముంచేసిన నేరానికి వీరికి కఠిన శిక్ష పడనుంది అని ఎఫ్ బీ ఐ డైరెక్టర్ క్రిస్టఫర్ అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం వెళ్తున్నామని అబద్ధం చెప్పి జంబాడాను జోక్విన్ గుజ్మానే విమానం ఎక్కించాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
మాదక ద్రవ్యాల అక్రమ తయారీ, ఎగుమతికి ప్రపంచ కేంద్రంగా నిలిచే మెక్సికోలో అత్యంత హింసాత్మక, శక్తిమంతమైన డ్రగ్స్ ముఠాల్లో సినోలా కార్టెల్ కూడా ఒకరు. దీనిన ఇఎల్ చాపో గుజ్మాన్, జంబాడా, మరొకరు సంయుక్తంగా స్థాపించి డ్రగ్స్ ని విచ్చలవిడిగా అమ్మడం మొదలు పెట్టారు. రూ.వందల కోట్ల డ్రగ్స్ సామ్రాజ్యానికి అధిపతిగా కొనసాగిన జాక్విన్ అర్చివాల్లో గుజ్మాన్ లోయోరా(ఎల్ చాపో)ను 2019లో మెక్సికోలో ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ తర్వాత అమెరికాకు అప్పగించడంతో అక్కడే జీవిత కాలకారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ఈంతో ఎల్ చాపో కుమారులు రంగంలోకి దిగి అక్రమ వ్యాపారాన్ని మరింత విస్తరించారు. అమెరికా సహా విదేశాలకు సరకు అక్రమ రవాణా మొత్తం జంబాడా కనుసన్నల్లో జరుగుతూ ఉంటుంది. ప్రత్యర్థి డ్రగ్స్ ముఠా సభ్యులు చిక్కితే వారి తల నరకడం, చర్మం వలిచేయడం, శరీరాన్ని ముక్కలు చేయడం, ముక్కలగా నరకడం వంటి చర్యలకు పాల్పడటం అక్కడి ముఠాలకు మామూలు విషయం.