సింధూర రెడ్డి మజాకా...ఇంగ్లీష్‌ ఇరగదీసే డేర్‌ లీడర్‌?

Veldandi Saikiran

* పల్లె రఘునాథ్ రెడ్డి కోడలుగా గుర్తింపు
* ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ మాట్లాడే సత్తా
* వైసీపీ అభ్యర్థిని చీల్చి చెండాడిన సింధూర



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త, యంగ్ లీడర్లు తెరపైకి వచ్చారు.  కొంతమంది తమ కుటుంబాల నుంచి చాలామంది రాజకీయ నాయకులను బరిలో దింపారు. అలాంటి వారిలో పల్లె రఘునాథ్ రెడ్డి  కోడలు పల్లె సింధూర రెడ్డి ఒకరు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో... పుట్టపర్తి బరిలో నిలబడ్డ సింధూర రెడ్డి... అఖండ విజయాన్ని నమోదు చేసుకున్నారు.

 

 పుట్టపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని... మొన్న జరిగిన ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారు ఈ లేడీ సూపర్ స్టార్. అయితే.. రాజకీయాలు సింధూర రెడ్డికి కొత్త అయినప్పటికీ... తన మామ అడుగుజాడల్లో నడిచి.. పుట్టపర్తి ప్రజల మన్ననలను పొందారు సింధూర రెడ్డి. అయితే సింధూర రెడ్డి... గతంలో ఎన్నో ఉన్నత చదువులను కూడా చదివారు. ప్రస్తుతం ఆమె వయసు 34 సంవత్సరాలు మాత్రమే.

 

 సింధూర రెడ్డి తన పాఠశాల విద్యను... కేరళ రాష్ట్రంలో  అభ్యసించారు. కేరళలో ఉన్నత విద్యను అందిస్తారన్న సంగతి తెలిసిందే. అలాంటి రాష్ట్రంలో చదివిన సింధూర రెడ్డి.. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా మాట్లాడేది. అంతేకాకుండా కోయంబత్తూర్ లో ఆమె ఇంజనీరింగ్ చేశారు. అనంతరం ఎంటెక్ కూడా పూర్తి చేసి... రాజకీయాల్లోకి దిగారు.

 

ఈ తరుణంలోనే... చాలా కాలేజీలకు అధినేతగా ఉన్న  పల్లె వెంకట కృష్ణారెడ్డిని వివాహం చేసుకున్నారు సింధూర రెడ్డి. అంటే పల్లె రఘునాథ్ రెడ్డి కోడలన్నమాట. ఇక సింధూర రెడ్డికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఆమె తండ్రి కుటుంబంది కలెక్టర్ బ్యాక్ గ్రౌండ్. అలాంటి సింధూర రెడ్డి...  కేవలం  8760 ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. ఇక.. రాజకీయాల్లో కీలక మార్పులు తేవాలని... పేద పిల్లలకు ఉన్నత చదువులు అందించాలన్నది ఆమె లక్ష్యం. అందుకే రాజకీయాల్లోకి వచ్చి... యువతకు ఆదర్శంగా నిలవాలని ఆమె చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: