సింపుల్ గా కనబడే డింపుల్.. యూపీ రాజకీయాల్లో చక్రం తిప్పేనా..?

FARMANULLA SHAIK
   * మృదుస్వభావంతో ప్రజల్ని ఆకర్షించడంలో ప్రత్యేక శైలి.!
  * తండ్రి కొడుకుల మధ్య సఖ్యత కుదర్చడంలో సక్సెస్.!
  *  సైలెంట్ గా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న డింపుల్.!
(ఉత్తరప్రదేశ్-ఇండియాహెరాల్డ్ ): సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిగా,పార్లమెంటు సభ్యుడిగా అలాగే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు వరుసగా పనిచేశాడు.మూలయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్ తండ్రి తర్వాత యూపీ రాష్ట్రానికి 21 ముఖ్యమంత్రిగా కూడా చేశారు.అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ ప్రస్తుతం మెయిన్ పురి లోకసభ స్థానం నుండి గెలిచి పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు.డింపుల్ తన అందంతో, వాక్చాతుర్యంతో యూపీ యూత్ లో మంచి పేరు సంపాదించి మామకు తగ్గ కోడలు అనేలా రాజకీయంగా దూసుకుపోతుంది.ఆమె గతంలో కన్నౌజ్ నుండి రెండు పర్యాయాలు మరియు మెయిన్‌పురి లోక్‌సభ నుండి ఒక పర్యాయం లోక్‌సభ సభ్యురాలిగా పనిచేశారు. డింపుల్ రావత్ విద్యార్థిగా ఉన్నప్పుడు అఖిలేష్ యాదవ్‌ను కలిశారు.వాస్తవానికి, యాదవ్ కుటుంబం వారి వివాహాన్ని వ్యతిరేకించినప్పటికీ చివరికి వారిద్దరి వివాహానికి మూలయం ఒప్పుకోక తప్పలేదు.2009లో ఫిరోజాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో నటుడు రాజకీయ నాయకుడు రాజ్ బబ్బర్‌పై యాదవ్ పోటీ చేసి విఫలమయ్యారు.ఆమె భర్త మే 2009 సార్వత్రిక ఎన్నికలలో ఈ నియోజకవర్గం మరియు కన్నౌజ్ రెండింటిలోనూ ఒక సీటును గెలుచుకోవడం మరియు అక్కడి నుండి అతని స్థానాన్ని కైవసం చేసుకోవడం వలన ఉప ఎన్నిక జరిగింది.

2012లో ఆమె కన్నౌజ్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఆమె భర్త ఉత్తర ప్రదేశ్ శాసన మండలిలో ప్రవేశించడానికి సీటును ఖాళీ చేయడం ద్వారా మరొక ఉప ఎన్నికకు కారణమైంది .ఆమె 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో కన్నౌజ్ లోక్‌సభ సీటును 19,907 ఓట్లతో సమీప ప్రత్యర్థిని ఓడించి నిలబెట్టుకున్నారు.2019 భారత సార్వత్రిక ఎన్నికలలో , ఆమె సమాజ్ వాదీ పార్టీ మరియు బహుజన్ సమాజ్ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసింది ,అయితే 10,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో bjp యొక్క సుబ్రత్ పాఠక్ చేతిలో ఓడిపోయింది.ఎప్పుడు పెద్దగా మాట్లాడని డింపుల్ మొదటిసారి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా ప్రచారం చేశారు.భర్త అఖిలేష్ కు సపోర్ట్ గా నిలిచి భారీ ర్యాలీలు చేశారు. అలాగే తండ్రి కొడుకుల మధ్య ఉన్న గొడవలను తొలగించి వారి మధ్య సఖ్యత కుదుర్చారు.
2022 అక్టోబరులో ములాయం సింగ్ యాదవ్ కన్నుమూసిన కారణంగా అనివార్యమైన మెయిన్ పురి లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డింపుల్ యాదవ్ 2.8 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిపార్లమెంట్ ఎంపీగా కొనసాగుతున్నారు.ఒకవైపు రాజకకీయంగా మరోవైపు కుటుంబంతో సరదాగా గడపడానికి సమయం కేటాయిస్తుంటానని అన్నారు.ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, పెయింటింగ్ వేయడం  లాంటివి ఇష్టపడతారు డింపుల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: