సిద్ధిపేట హీరో హరీశ్ రావు ట్రాక్ రికార్డుకి ఔరా అనాల్సిందే?

Purushottham Vinay

• రాజకీయవేత్తగా రికార్డ్ మెజారిటీలు కొట్టిన హరీశ్ రావు! 

• రాజకీయ దిగ్గజం ysr రికార్డునే బద్దలు కొట్టిన హరీశ్ రావు! 


సిద్ధిపేట - ఇండియా హెరాల్డ్:  BRS ఎమ్మెల్యే హరీశ్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2014 వ సంవత్సరంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 93328 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు హరీష్ రావు. 2018 లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఏకంగా 1,18,699 ఓట్లతో రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో, భారతదేశంలోని అతి పిన్న వయస్కుడుగా శాసనసభలోనూ ఆరుసార్లు సభ్యుడయ్యి రికార్డ్ సృష్టించాడు. 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలని చేపట్టాడు. అలాగే హరీష్‌ రావుకు ఆరోగ్యశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గత BRS ప్రభుత్వం 2021, నవంబరు 9న ఉత్తర్వులు కూడా జారీ చేసింది.


హరీశ్ రావు ట్రాక్ రికార్డ్ కనుక చూసుకుంటే.. ఈయన మొదట 2004 లో తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని సిద్దిపేట శాసనసభ నియోజక వర్గం నుంచి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో యువజన సర్వీసులు, ప్రింటింగ్‌ స్టేషనరీ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. కేసీఆర్ సిద్దిపేట శాసనసభ, కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు ఎన్నికైనందున సిద్దిపేట స్థానాన్ని ఆయన ఖాళీ చేయవలసి వచ్చింది. అయితే ఆ ఖాళీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్ రావు ఎన్నికైనారు. హరీశ్ రావు మంచి నాయకునిగా ఎదిగి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు అవిశ్రాంతంగా ఉద్యమాలు కూడా నడిపారు. సిద్దిపేట శాసన సభ స్థానానికి 2004 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఏకంగా 24827 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఏకంగా 58935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయితే 64014 ఓట్లలతో గెలిచాడు. హరీశ్ రావు 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95858 ఓట్లతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొంది 2009 లో వై.యస్.రాజశేఖరరెడ్డి పులివెందుల నియోజక వర్గంలో సాధించిన 68,681 ఓట్ల రికార్డును తిరగరాశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: