జీరోలు.. హీరోలు: దశాబ్దాలుగా ఓడిపోతున్నా టీడీపీలోనే ఉన్న సోమిరెడ్డి.. చివరికి హీరో అయ్యారు..?

Suma Kallamadi

• అప్పట్లో జీరో ఎప్పుడు గెలిచే హీరోలయ్యారు  
• వారందరిలో ముఖ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి
• ఐదుసార్లు ఓడిన చివరికి గెలిచి చూపించారు
(ఏపీ - ఇండియహెరాల్డ్)
టీడీపీ సీనియర్ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి చాలా ఏళ్లుగా పోటీ చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన వరుసగా గత ఐదు దఫాల ఓటమి పాలవుతూ వచ్చారు. ఆయన పని అయిపోయిందని, టీడీపీ నుంచి టికెట్ లభించే అవకాశం కూడా లేదని 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచారం జోరుగా సాగింది. అయితే టీడీపీ నుంచి ఎన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయినా సోమిరెడ్డి పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు తప్పితే దాన్నుంచి విడిపోలేదు. వైసీపీలో చేరితే గెలిచే ఛాన్సెస్ పెరుగుతాయని తెలిసినా ఏనాడు అటువైపు జంపు చేయలేదు.
టీడీపీ అధిష్టానం కూడా అతడిని నమ్ముతూ వచ్చింది. చాలా కీలకమైన, ఎంత అవసరం ఉన్నా కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చింది. చంద్రమోహన్ రెడ్డి 2004 నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తూ వస్తున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. మళ్లీ 2019లో ఆయనే చంద్రమోహన్‌ను ఓడించారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్థన్ రెడ్డితో తలపడ్డారు కానీ గెలవలేకపోయారు.
ఇదిలా ఉంటే 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు సోమిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారు. తన మంత్రివర్గంలో చోటు కల్పించి అతడి విశేషమైన సేవలను గుర్తించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయశాఖను అప్పగించి తగిన విలువ అందించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి 1,03,278 ఓట్లు గెలిచి 16,288 మెజారిటీతో భారీ విజయం సాధించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిని చిత్తు చేసి తన ప్రతీకారం తీర్చుకున్నారు. జీరో నుంచి హీరోగా ఎదిగి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇప్పుడు ఈ పొలిటిషియన్ 20 ఏళ్లలో గెలిచిన తర్వాత తాను ఏం చేయాలని భావించారో అది చేస్తున్నారు. సర్వేపల్లి ప్రజలకు మంచి చేయాలని అనునిత్యం పరితపిస్తున్నారు. ఇన్నేళ్లుగా ఆయన పాలిటిక్స్ లో ఉండటం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: