ఫ్రాన్స్‌కు చుక్కలు చూపిస్తున్న ముస్లిం శరణార్దులు?

Chakravarthi Kalyan
తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని చిన్నయసూరి అంటారు. అంటే.. మనల్ని దాటి, మన స్థాయిని దాటి ఎవరికీ మంచి చేయకూడదు. చేస్తే అది నీకే చేటును తెస్తుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతుంది అదే. ఫ్రాన్స్ ఒక్కటే కాదు యావత్ యూరప్ సమాజం మొత్తం తనకు తాను సమీక్ష చేసుకోవాల్సిన సమయం వచ్చింది.
మానవతా దృక్పథం, తక్కువ కూలీకే ఛీప్ లేబర్ దొరుకుతారు అనే ఉద్దేశంతో ఆఫ్రికా, ఇరాన్ , పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు ఆశ్రయం కల్పించారు. ఇప్పుడు ఆ శరణార్థులే ఏకు మేకై కూర్చొన్నారు. ఒలింపిక్స్ ప్రారంభోత్సవం వేళ ఫ్రాన్స్ లో గందరగోళం నెలకొంది.  అది అందర్నీ ఆందోళనకు గురి చేసింది. హై స్పీడ్ రైలు నెట్ వర్క్ పై దాడి జరిగింది. దీంతో రైలు సేవలకు తీవ్ర అంతరాయం నెలకొంది. ఫ్రాన్స్ జాతీయ రైలు ఆపరేటర్ ఎన్సీఎప్ దాని హై స్పీడ్ రైలు నెట్ వర్క్ లో అనేక విధ్వంసక ఘటనలు జరిగాయి.
దీని కారణంగా పలు రైళ్ల సేవలకు అంతరాయం నెలకొంది. ఒలింపిక్ ప్రారంభోత్సవం వేడుకకు కొన్ని ఘంటల ముందే ఫ్రెంచ్ రైలు ఆపరేటర్ కంపెనీ ఎస్ఎన్సీఎఫ్ ఈ మొత్తం విషయాన్ని వార్త సంస్థ ఏఎఫ్పీకి తెలియజేసింది. ఎస్ఎన్సీఎఫ్ ఫ్రాన్స్ హై స్పీడ్ రైలు నెట్ వర్క్ పై కాల్పులు జరిపినట్లు తెలిపారు. తాజా దాడితో ఫ్రాన్స్  పశ్చిమ, ఉత్తర, తూర్పు ప్రాంతాల రైల్వే లైన్లు ప్రభావితం అయ్యాయి.
ఈ దాడుల ప్రభావం డొమెస్టిక్ రైళ్లపైనే మాత్రమే కాదు ఛానల్ టన్నెల్ ద్వారా వెళ్లే పొరుగు దేశాలైన బెల్జియం, లండన్ వెళ్లే రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ రైల్వే వ్యవస్థను సరి చేయడానికి మూడు రోజుల సమయం పడుతుందని అంచనా.  ఈ ఘటనతో ఎనిమిది లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఒకవేళ ఈ ఘటనలో ఏదైనా జరగరానిదే జరిగితే అపార ప్రాణ నష్టం జరిగేదే. ఇప్పటికైనా శరణార్థుల విషయంలో ఆయా దేశాలు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: