ఏపీ: రికార్డ్ స్థాయిలో జనసేన సభ్యత్వాలు.. నాగబాబు కీలక ప్రకటన..!

Divya
జనసేన పార్టీ గత కొద్ది రోజుల క్రితం పార్టీ సభ్యత్వ  నమోదును ప్రవేశపెట్టింది. ఈనెల 18 నుంచి ప్రారంభమైన ఈ సభ్యత నమోదు కార్యక్రమానికి సైతం చాలామంది పార్టీ శ్రేణులు అభిమానులు కూడా మంచి స్పందన ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జనసేన పార్టీలోకి సభ్యత్వాలు నమోదు రికార్డు స్థాయిలో కూడా జరిగినట్లు తెలుస్తోంది. దాదాపుగా 10 లక్షల సభ్యత్వాలు నమోదైనట్లుగా జనసేన పార్టీ నుంచి సీనియర్ నేత నాగబాబు తెలియజేయడం జరిగింది. గత ఏడాది కంటే భారీగానే సభ్యత్వాలు నమోదు అయ్యాయని వెల్లడించారు.

ఆదివారంతో జనసేన సభ్యత కార్యక్రమాన్ని ముగియాల్సి ఉండగా విశేష స్పందన రావడంతో మరొక వారం రోజులపాటు పొడిగించినట్లు నాగబాబు తెలియజేశారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఐదువేల సభ్యత్వాలు కావాలని కూడా నాగబాబు పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. ఇక గతంలో ఆరు లక్షల 47 వేల సభ్యత్వాలు నమోదు అయినప్పటికీ కానీ తాజాగా ఇప్పటికే 10 లక్షల వరకు ఈ సంఖ్య చేరిందని తెలియజేశారు. జనసేన పార్టీ శ్రేణులు కూడా ఈ విషయం పైన ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నారు.

అయితే జనసేన పార్టీ సభ్యత్వం స్వీకరించిన కొత్త వారు ఎవరు ఏ పార్టీ కార్యకర్త నేతలు జనసేన పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు అనే విషయం పైన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి పూర్తిగా సమాచారం తెలియాలి అంటే మరో కొద్ది రోజులలో తెలియజేసేలా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే జనసేన పార్టీ కూటమిలో భాగంగా కీలకంగా మారిందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కి కూడా డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు. 2029 ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ సింగల్ గా పోటీ చేస్తుందా లేకపోతే మళ్లీ కూటమిలోనే పోటీ చేస్తుందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం ఈ విషయమైతే అటు పవన్ కళ్యాణ్ అభిమానులను ఆనందపరిచేలా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: