విజయ్ సాయి రెడ్డి పై పంచ్ ల వర్షం.. అనిత టార్గెట్ ఆ అంశంపైనే..!

Divya
•దొంగలే కోటల్లో రాజ్యమేలుతున్నారు..
•ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదు ఎన్డీఏ ప్రభుత్వం..
•విజయ్ సాయి రెడ్డి పై అనిత పంచ్ ల వర్షం..
(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)
2024 ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు పూర్తిస్థాయిలో టార్గెట్ చేస్తున్నారు.  ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న దాడుల పైన ఢిల్లీ వేదికగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధర్నా కూడా చేశారు.. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ మినహా మిగిలిన అన్ని పార్టీలు కూడా ఈ ధర్నాలో హాజరయ్యాయి. అయితే జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హోంమినిస్టర్ వంగలపూడి అనిత తనదైన స్టైల్ లో పంచ్ వేయడమే కాదు ఘాటుగా స్పందించారు కూడా.
విజయ్ సాయి రెడ్డి శాంతిభద్రతల పైన తన ట్విట్టర్ ఖాతా ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రి మాటలు కోటలు దాటుతున్నా..చేతలు గడప దాటడం లేదు.. బొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వల్లే రాష్ట్రం భయం గుప్పెట్లోకి వెళ్లిపోయింది.. బయటకు వస్తే ఏమవుతుందో తెలియని ధారుణ పరిస్థితి.. దీనికి బాధ్యత హోమ్ మంత్రిదే.. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యింది అంటూ రెచ్చిపోతూ కామెంట్ చేయడమే కాదు నైతిక బాధ్యత వహించి హోం మంత్రి వైఫల్యం చెందిన నేపథ్యంలో ఆమె రాజీనామా చేయాలి అంటూ ఘాటుగా స్పందించారు.. అంతే కాదు ప్రభుత్వ వైఫల్యం పై గవర్నర్ విచారణకు ఆదేశించాలని కూడా తెలిపారు విజయసాయిరెడ్డి.

అసలే పిడుగు తనపై ఎవరైనా పడితే మాత్రం అవతల వారిని దగ్ధం చేసే శక్తి ఉన్న నారీమణి వంగలపూడి అనిత.. అలాంటిది తననే రాజీనామా చేయాలని విజయ్ సాయి రెడ్డి కామెంట్లు చేయడంతో తనదైన శైలిలో కామెంట్లు చేసి విరుచుకుపడింది  వంగలపూడి అనిత.. శాంతిభద్రతల విషయంలో సాయి రెడ్డి రాజీనామా చేయాలో నేను చేయాలో కాలమే నిర్ణయిస్తుంది. అయినా ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదు ఎన్డీఏ ప్రభుత్వం అంటూ విజయసాయిరెడ్డి వ్యక్తిగత జీవితం టార్గెట్ చేస్తూ ఆమె పంచులు వేసింది.  అంతేకాదు ప్రజలు బానే ఉన్నారు. దొంగలే కోటల్లో దాక్కొని ప్రెస్ మీట్ లు ఎక్స్ లో రెట్టలు వేస్తున్నారు అంటూ పేర్కొంది.. మొత్తానికైతే ఎక్కడ టార్గెట్ చేయాలో అక్కడే టార్గెట్ చేస్తూ తనను తాను మరింత బలోపేతం చేసుకుంటుంది హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: