బ్రేకింగ్: జగన్ దెబ్బ.. స్పీకర్ కు నోటీసులు..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 164 సీట్లు కూటమి కైవసం చేసుకోగా, కేవలం 11 సీట్లతోనే వైసీపీ ప్రభుత్వం సరిపెట్టుకుంది. ఇక్కడ అసెంబ్లీలో వైసిపి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతిపక్ష హోదా లభించాలి అంటే 18 సీట్లు రావాల్సి ఉంటుంది. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరి జగన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టగా అసెంబ్లీ సెక్రటరీ ,స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది . రూల్ పొజిషన్ వివరాలను తమ ముందు ఉంచాలని కూడా హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను మరో మూడు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలి అని వైసిపి అధినేత మాజీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు.  రాజకీయ కక్షతోనే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, జగన్ తరపు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు కూడా వినిపించారు. అసెంబ్లీలో తమను ప్రతిపక్ష హోదా కల్పించి తమ పార్టీని గుర్తించేలా చూడాలి అని కూడా కోర్టును కోరారు.. ఈ క్రమంలోనే దీనికి కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ కి,  అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. మొత్తానికైతే ఈ విషయం తెలిసి వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ దెబ్బ కొట్టడం మొదలైందని జగన్ దెబ్బకు ఎదుటివారు అబ్బా అనాల్సిందే అంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి . మొత్తానికి అయితే తనకు ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి పరిస్థితిలను చూస్తుంటే కచ్చితంగా తాను ప్రతిపక్ష హోదా తెచ్చుకునేలా కనిపిస్తోంది. ఏది ఏమైనా అప్పుడే చక్రం తిప్పడం మొదలుపెట్టారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి . మరి ఏ మేరకు ప్రజల కోసం పోరాటం చేస్తారో చూడాలి. మొత్తానికి అయితే వైసిపి ప్రభుత్వం మళ్లీ ప్రతిపక్ష హోదాను దక్కించుకొని తిరిగి ప్రజల బాగు కోసం పోరాడుతారని ప్రజలు ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: