ఏపీ: హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఊరట..!

Divya
జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లపైన చేసినటువంటి వ్యాఖ్యల పైన కొంత మంది గుంటూరు పరిసర ప్రాంతాలలో ఉండేవారు కేసు నమోదు చేయించారు. అయితే ఈ కేసును సవాల్ చేస్తూ జనసేన హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గుంటూరులో తన పైన నమోదైన కేసును క్యాష్ చేసుకోవాలని పిటీషన్ దాఖలు చేయడం జరిగింది జనసేన. దీంతో నిన్నటి రోజున ఈ విచారణ చేపట్టిన హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.

నిన్నటి రోజున ఈ కేసు విచారణ పైన స్టే విధిస్తూ పలు రకాల ఉత్తర్వులను విడుదల చేసింది ఏపీ హైకోర్టు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ స్టే కొనసాగుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.. అనంతరం ఈ కేసు హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసినట్లుగా తెలియజేసింది.. గత వైసిపి ప్రభుత్వం తీసుకు వచ్చిన వాలంటరీ వ్యవస్థ పైన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ వాలెంటరీలను ఉద్దేశించి పలు రకాల వ్యాఖ్యలు చేశారు.. వాలంటరీ వ్యవస్థ జగన్ కు సొంత సైన్యంలా మారిందని ఆ వ్యవస్థ మొత్తం రద్దు చేయాలి అంటూ జనసేన నేతలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో మాటలు మాట్లాడారు.

ఈ సమయంలోనే చాలా మంది వాలంటరీలు సైతం ఫిర్యాదు చేయడంతో పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదయ్యింది.. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కి ఈ కేసు నుంచి కాస్త రిలీఫ్ లభించింది అని చెప్పవచ్చు.. అయితే ఎన్నికలకు ముందు వాలంటరీలకు సైతం పదివేల రూపాయలు ఇస్తామని కూటమిలో భాగంగా తెలియజేశారు.. కానీ ఇప్పటివరకు ఈ విషయం పైన అటు పవన్ కళ్యాణ్ కాని చంద్రబాబు కానీ ఏ విధంగా స్పందించలేదు. దీంతో వాలంటీర్లు మాత్రం అయోమయంలో పడ్డట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: