ఏపీ: ఒకేరోజు అన్ని వేల మంది ఉద్యోగుల పదవీ విరమణ..!

Divya
ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ సీజన్ ఇప్పుడు ఎక్కువగా నడుస్తోంది.జూలై నెల ఆఖరి రోజున దాదాపుగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేసేవారు సుమారుగా 7000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయినట్లుగా తెలుస్తోంది. గతంలో వీరందరూ రిటైర్డ్ అయితే జీతభత్యాలు ఇవ్వాల్సి వస్తుందని ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం రెండేళ్లు పదవి విరమణ వయసును కూడా పెంచారు. దీంతో ఉద్యోగుల రిటైర్మెంట్ లేకుండా పోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు రెండేళ్లు పూర్తి అవ్వడంతో అందరూ కూడా ఒక్కసారిగా రిటైర్డ్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మొదట 58 ఏళ్లుగా ఉండే రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పొడిగించడం జరిగింది.. ఒకవేళ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో 58 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగం రిటైర్మెంట్ ఉన్నట్లు అయితే సుమారుగా 40000 మంది వరకు మళ్లీ కొత్త రిక్రూమెంట్ జరిగేదట.. ప్రస్తుతం నిరుద్యోగులు కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా మంది రోజురోజుకి పెరుగుతూనే ఉన్నారు. ఉచిత పథకాలు, ఉద్యోగులకు జీతాలు, అభివృద్ధి ఇతరత్రా వాటిని దృష్టిలో పెట్టుకొని ఏపీ సీఎం అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు అలాగే.. కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే రాబోతున్నదట. అలాగే గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో రాబోయే వచ్చే ఐదేళ్లలో ఉద్యోగుల జాతర ఎక్కువగా ఉంటుందంటూ ఏపీ ప్రభుత్వం తెలియజేస్తోంది. ఏది ఏమైనా ఒకేసారి 7,000 మంది ఉద్యోగులు పదవి విరమణ ఇవ్వడంతో రాష్ట్ర ఖజానాకు మరొకసారి గండిపడేలా కనిపిస్తోంది. మరి ఇలాంటివన్నీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి. ఇప్పటికే ఆర్థికంగా కూడా ఏపీ రాష్ట్రం దెబ్బతినిందనే విధంగా తెలియజేస్తోంది కూటమి ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: