ఏపీ సిఎం: సూపర్ -6 ఫెయిల్యూర్.. సూపర్ 3 సక్సెస్..!

Divya
ఎన్నికల సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలతో ఎన్నికల బరిలో దిగారు. చాలా సక్సెస్ అయ్యి భారీ విజయాన్ని అందించింది. అయితే అధికారంలోకి చేపట్టిన తర్వాత ఏపీ ఆర్థికంగా దెబ్బతినిందని జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఇప్పటికిప్పుడు వాటిని అమలు చేయడం సాధ్యం కాదనే విధంగా చంద్రబాబు తెలియజేశారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది నేతలు అప్పులు ఉన్న విషయం ముందుగానే తెలియదా మరి ఎందుకు సూపర్ సిక్స్ హామీలు ప్రకటించారు అంటూ ఎద్దేవ చేస్తున్నారు.

కచ్చితంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాల్సిందే అని పలువురు ప్రజలు కూడా పట్టుబడుతున్నారు. గతంలో మీడియా మీటింగ్ లో సూపర్ సిక్స్ హామీల విషయంలో చాలామంది టిడిపి నేతలు కూడా ఊదరగొట్టారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని కేవలం సూపర్ 3 పథకాలను మాత్రమే అమలుచేయడం ఏపీ సీఎం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 1). పింఛన్ పెంచడం 2).రెండోది తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా 1500 చొప్పున ఇవ్వడం..3). నిరుద్యోగులకు 3000 రూపాయలు ఇవ్వడం..4). 18 ఏళ్లు నిండిన మహిళలకు 1500 నెల నెల ఇవ్వడం 5). ఉచితంగా మహిళలకు ఆర్టీసీ ప్రయాణం.6). రైతు భరోసా కింద 20000 ఇవ్వడం.

అయితే ఇప్పుడు ఇందులో మూడు హామీలనే అమలు చేస్తున్నారు. అందులో ఒకటి పింఛన్ పెంపడం, మరొకటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అలాగే సూపర్ సిక్స్ లో లేని అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం వంటివి చేయబోతున్నారట.. దీన్నిబట్టి చూస్తే సూపర్ సిక్స్ హామీ పథకాలు ఫెయిల్యూర్ అని సూపర్ 3 పథకాలు సక్సెస్ అని కూడా చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలకు తగ్గట్టుగానే ఏపీ సీఎం ప్లాన్ చేస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: