రేవంత్ రివేంజ్.. BRS దిగ్గజలకు అవమానం?

Purushottham Vinay

• తెలంగాణ శాసనసభలో గందరగోళ పరిస్థితి
• మొత్తానికి అధికార బలంతో రివేంజ్ తీర్చుకుంటున్న రేవంత్
• BRS నేతల అరెస్ట్ పై రక రకాలుగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్

హైదరాబాద్ - ఇండియా హెరాల్డ్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మరోసారి గందరగోళ పరిస్థితి అనేది నెలకొంది. అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా మాట్లాడారంటూ..తక్షణమే వారికి క్షమాపణలు చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ వెనకాల ఉన్న అక్కలు మోసం చేస్తారని.. గతంలో నన్ను మోసం చేసే ఇప్పుడు మీ వెనుక కూర్చున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో దీంతో బీఆర్ఎస్ మహిళా సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని కచ్చితంగా వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సభ నుండి వాకౌట్ చేసి.. సీఎం ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సీఎం ఛాంబర్ ముందు వారు నిరసన వ్యక్తం చేశారు.బీఆర్‌ఎస్ మహిళా

ఎమ్మెల్యే పట్ల సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట నిరసన చేపట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేటీఆర్‌, హరీష్ రావును లిఫ్ట్ చేసి మరీ వ్యాన్‌లో ఎక్కించడం అనేది నిజంగా చాలా అవమానకరం. ఆ తరువాత వారిని అసెంబ్లీ నుంచి తెలంగాణ భవనకు పోలీసులు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం డౌన్ డౌన్ అంటూ కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా గతంలో సీఎం రేవంత్ రెడ్డి తనకు జరిగిన అవమానానికి టిట్ ఫర్ టాట్ అనే విధంగా రివేంజ్ తీర్చుకున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణకి ఇక తామే రాజులు అనుకున్న BRS నేతలని రోడ్డుకి ఈడ్చి పోలీసులతో లాక్కెల్లే విధంగా రేవంత్ రెడ్డి అవమానించాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. BRS నేతలని ఉద్దేశిస్తూ కర్మ ఎవరిని వదలదని అప్పుడు మీరు వారిని అవమానించారు ఇప్పుడు వారు మిమ్మల్మి అవమానించారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: