ఐరన్ లెగ్ అంటూ ఘోర అవమానం.. తిప్పి కొట్టిన రోజా..!

frame ఐరన్ లెగ్ అంటూ ఘోర అవమానం.. తిప్పి కొట్టిన రోజా..!

Divya
•ఐరన్ లెగ్ అంటూ అసెంబ్లీలో ఘోర అవమానం
•రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయిన రోజా
•నోటి దురుసే నేడు మళ్ళీ ఓటమి పాలు చేసిందా..

ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోకి నటిగా అడుగుపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వరుస పరాజయాలు ఎదురవడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది.. ఆ తర్వాత గ్లామర్ ఒలకబోస్తూ తనదైన శైలిలో అందరిని ఆకట్టుకుంటూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించి మంచి పేరు సొంతం చేసుకుంది రోజా. అంతేకాదు ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందించాయి. ఇకపోతే సినిమాలలో సక్సెస్ అందుకున్న తర్వాత రాజకీయ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో భాగంగానే 1998లో తెలుగుదేశం పార్టీతో జతకట్టి వారి తరఫున ప్రచారం కూడా చేసింది. ఆ తర్వాత ఆమెకు టిడిపి మహిళా అధ్యక్షురాలిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యతలు అప్పగించారు.

ఇక 2004 లో జరిగిన ఎన్నికలలో నగరి అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి టికెట్ పై పోటీ చేసి ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. అప్పటినుండి ఆమె పార్టీకి దురదృష్టంగా భావించారు పార్టీ నేతలు.. అందులో భాగంగానే 2009 ఎన్నికల్లో కూడా మళ్లీ ఆమెకు చంద్రగిరి నియోజకవర్గం నుంచి టికెట్టు కల్పించారు. అయితే ఆ సమయంలో కూడా ఆమె ఓడిపోవడంతో అసెంబ్లీలో ఆమెను ఐరన్ లెగ్ అంటూ ఘోరంగా అవమానించారు నాటి ముఖ్యమంత్రి..ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీంతో పూర్తి స్థాయిలో మనస్థాపం చెందిన రోజా అసెంబ్లీలో కన్నీటిని పెట్టుకుని ఆ తర్వాత దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుంది.
అయితే అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి మరణించడంతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఇక 2009లో జగన్మోహన్ రెడ్డి కొత్తగా స్థాపించిన వైఎస్ఆర్ పార్టీలో ఆమె చేరింది.  ఆ తర్వాత జగన్ అక్రమస్తుల కేసులో జైలు పాలు అయ్యారు. ఈ సంఘటన తర్వాత మళ్లీ ఆమెను ఐరన్ లెగ్ అనే సెంటిమెంటు వెంటాడింది. ఇక ప్రతి ఒక్కరు కూడా ఈమెను పార్టీలో చేర్చుకోవడానికి భయపడ్డారు కూడా అయితే జగన్మోహన్ రెడ్డి ఆమెను 2014లో నగరి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించడంతో అక్కడ ఆమె గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. అయితే ఆ సమయంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోయినా నగరి నుంచే ఈమె ఎమ్మెల్యేగా గెలిచింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా మళ్లీ నగరి నుండి పోటీ చేసి మళ్లీ గెలిచింది. ఇక శాసన సభ్యురాలిగా పనిచేసిన ఈమె ఆ తర్వాత మంత్రిగా కూడా కేబినెట్లో అడుగుపెట్టింది. అలా అటు ఇండస్ట్రీలో ఇటు రాజకీయ రంగంలో ఐరన్ లెగ్ అనిపించుకున్న ఈమె తర్వాత గెలిచి గోల్డెన్ లెగ్ గా తనను మార్చుకుంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తన నోటి దురుసు కారణంగా ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయి 2024 ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ గెలవలేకపోయింది రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: