దొంగ అంటూ రేవంత్ రెడ్డిని అవమానించిన కేసీఆర్...?

Suma Kallamadi

• అసెంబ్లీలో అవమానాలు
• మాజీ సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి పై షాకింగ్ కామెంట్స్  
• అంతకంతకు పగ తీర్చుకుంటూ షాక్ ఇస్తున్నారు రేవంత్
( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)
ఇటీవల కాలంలో అసెంబ్లీలో పొలిటిషన్లో ఒకరిపై ఒకరు అవమానకర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఏపీలో ఈ అవమానాలు అనేవి పీక్ స్టేజ్‌కి చేరుకున్నాయి. ఇక తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి నెలకొన్నది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీ బాగా విమర్శించేవారు. మాతృభూమికి అన్యాయం చేస్తున్న ద్రోహి అంటూ అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. "ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవి నువ్వు", 'రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగవి నువ్వు' కేసీఆర్ చాలా సందర్భాల్లో హుమిలియేట్ చేయడానికి ప్రయత్నించారు.
ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మందు తాగి పండుతాడు తప్ప చేసేదేమీ లేదు అంటూ అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ సంక నాకండి, బీఆర్ఎస్ నేతల పేగులు మెడలో వేసుకుని తిరుగుతా అంటూ సీఎం హోదాకి తగిన మాటలు మాట్లాడటం లేదు. "ఒరేయ్ సన్నాసి, గాడిద, ఏం పీకినవ్, కొడకల్లారా" వంటి దారుణమైన పదజాలాన్ని కూడా ఉపయోగించారు. అసెంబ్లీ వెలుపల చేసినా ఈ కామెంట్స్ చాలామందికి షాకిచ్చాయి. మరోవైపు ఇప్పుడు కూడా తెలంగాణ సీఎంపై బీఆర్‌ఎస్‌ నేతలు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. తాలిబన్ వారసుడిలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని ఇటీవల కామెంట్లు చేశారు.
 మొత్తం మీద అసెంబ్లీలో వాడాల్సిన పదజాలం వాడకుండా చాలా రెచ్చిపోయారు. వాళ్లకి నేనేమీ తక్కువ తినలేదు అంటూ రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో వాడకూడని భాష వాడుతున్నారు. ఇటీవల సబితా ఇంద్రారెడ్డి పై కూడా ఆయన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద అసెంబ్లీలో ఒకరిని ఒకరు అవమానించుకోవడం బాగా పెరిగిపోతోంది ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి బదులుగా వీళ్ళు ఇలా ప్రవర్తించడం అందరికీ షాక్ ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: