ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు తెలుగుదేశం కూటమి సర్కార్ ఏదోమార్గం ఎంచుకుంటూ నే ఉంది. ఎక్కడ సందు దొరికితే.. అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం. దీంతో జగన్మోహన్ రెడ్డి ఉక్రిబిక్కిరి అవుతున్నారు. అసలు ఏం చేయాలి అనే దానిపై పెద్దగా క్లారిటీగా.. జగన్మోహన్ రెడ్డి కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి.
వైసిపి రాజ్య సభ సభ్యుల ను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు నాయుడు కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కో రాజ్యసభ సభ్యు డు కి 40 నుంచి 70 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడట. ఈ మేరకు వైసిపి రాజ్యసభ సభ్యులతో చర్చలు కూడా జరుపుతు న్నారట తెలుగు తమ్ముళ్లు. దీనికి ప్రత్యేకమైన కారణం ఉందన్న సంగతి తెలిసిందే.
తెలుగు దేశం పార్టీ కి అఖండ మెజారిటీ వచ్చిన ప్పటికీ... రాజ్యసభ లో మాత్రం... ఆ పార్టీకి అసలు బలం లేదు. అందుకే 11 సభ్యులు ఉన్న వైసీపీ పైన కన్ను వేశారు చంద్రబాబు నాయుడు. ఇందులో నలుగురి నుంచి ఐదుగురిని కొనుగోలు చేసేందుకు... స్కెచ్ వేస్తున్నారట. తెలుగుదేశం సభ్యుడు రాజ్యసభలో ఉండడానికి మరో రెండు సంవత్సరాల సమయం పడుతుంది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగేలా లేడు.
అందుకే ఇప్పటినుంచి వైసీపీ సభ్యులను... టిడిపిలో జాయిన్ చేసుకోవాలని అనుకుంటున్నారట చంద్రబాబు నాయుడు. అటు బిజెపి కూడా చంద్రబాబుకు ఇదే పని అప్పగించినట్లు చెబుతున్నారు. వస్తే తెలుగుదేశం పార్టీలో చేర్చుకోండి లేదా బిజెపిలోకి రానిచ్చేలా... కూటమి సభ్యులు ప్లాన్ వేస్తున్నారట. మరి ఈ ఉప ద్రవాన్ని జగన్ మోహన్ రెడ్డి ఎలా తట్టుకుంటారో చూడాలి. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయింది.