వల్లభనేని వంశీ: అమెరికాకు పరార్?

Purushottham Vinay

కృష్ణా జిల్లా గన్నవరం తెలుగు దేశం పార్టీ యొక్క కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నిందితుడు అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే అమెరికా వెళ్లినట్లు ఏపీ పోలీసులు గుర్తించడం జరిగింది.అయితే హైదరాబాద్‌లో ఆయన ప్రధాన అనుచరుడు ఉన్నట్లు తెలియడంతో గాలింపు చర్యలని చేప్టటారు. పార్టీ ఆఫీస్‌పై దాడి ఘటనలో వంశీ అనుచరుడిది ముఖ్యమైన పాత్రగా గుర్తించడం జరిగింది.గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని 71వ నిందితుడిగా పోలీసులు పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 18 మందిని అరెస్టు చేశారు. ఈ దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా. ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైకాపా మూకలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మొన్నటి దాకా వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండడం, దాదాపుగా వంశీ సొంత మనుషులుగా చెలామణి అయిన పోలీసులే కీలక స్థానాల్లో ఉండడంతో ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 


అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.పోలీసులు వంశీ సహా పలువురు కీలక నిందితుల్ని వదిలేశారంటూ టీడీపీ శ్రేణుల నుంచి విమర్శలు పెద్ద వెల్లువెత్తాయి. పైగా టీడీపీ పెద్దలు కూడా వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు, నాలుగేళ్ల నుంచి కూడా పార్టీ శ్రేణుల్ని వేధించడం, నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించడాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వంశీని అరెస్టు చేయాలనే ఒత్తిడి బాగా పెరిగింది. జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధరరావు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వంశీ కుటుంబం హైదరాబాద్‌లోనే నివసిస్తుండడం, ఎన్నికల ఫలితాల తరువాత ఆయన కూడా అక్కడే ఉంటున్నట్లు తెలియడంతో పోలీసులు అరెస్టుకు కార్యాచరణ చేపట్టడం జరిగింది. గురువారం నాడు ఏకంగా మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌ వెళ్లాయి. అయితే వంశీ ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి ఉంటారనే ప్రచారం బాగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: