బ్రేకింగ్: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. !

frame బ్రేకింగ్: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. !

Divya
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాజాగా గన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదు నుంచి గన్నవరం చేరుకున్న వంశీ వాహనాన్ని గమనించిన పోలీసులు ఆయన ఇంటి సమీపంలోని అదుపులోకి తీసుకున్నారు.. వెంటనే గన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ విషయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది . ఇకపోతే గన్నవరంలో టిడిపి కార్యాలయం పై దాడి చేసిన కేసులో వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ దాడిలో వంశీ నేరుగా పాల్గొనక పోయినా,ఎమ్మెల్యే హోదాలో ఉండి ఆయన సహకారంతోనే వైకాపా మూకలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి., అందులో భాగంగానే ఆయనను ఈరోజు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
టిడిపి కార్యాలయం పై దాడి చేసిన వారిలో ఇప్పటికే 18 మంది నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ఇకపోతే మొన్నటి వరకు వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండడం దాదాపు వంశీ సొంత మనుషులుగా చలామణి అయిన పోలీసులే కీలక స్థానాల్లో ఉండడంతో ఈ కేసులో ఎటువంటి చర్యలు ఎవరు తీసుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ అరాచకాలపై కూటమి దృష్టి సారించింది . టిడిపి కార్యాలయం పై దాడికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.  ఈ మేరకు గత నెల 9వ తేదీన బాపులపాడు ఎంపీపీ నగేష్ తో సహా 15 మందిని,  ఆ తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు . మిగతావారు పరారీలో ఉండగా తాజాగా ఇప్పుడు వంశీని అరెస్టు చేశారు.
జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గంగాధర్ రావు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి , గన్నవరంలోని ఆయన ఇంటి సమీపంలో కాపు కాసారు. హైదరాబాద్ వెళ్లిన ఆయన నేరుగా గన్నవరం చేరుకోవడంతో కాపు కాసిన పోలీసులు ఆయన ఇంటి సమీపంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: