జనసేన: ఆఫీసు వద్ద క్యూ కట్టిన బాధితులు.. సూపర్ రెస్పాన్స్..!

Divya
జనసేన పార్టీ కార్యాలయం దగ్గర బారులు తీరుతునటువంటి వారు అనేకమంది వైసీపీ పార్టీ హయాంలో జరిగినటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి వాటిపైన కంప్లైంట్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కడప జిల్లా వేముల మండలానికి చెందిన .. బేరి దేవ భూషణ్ అనే వ్యక్తి తాను కొనుగోలు చేసిన ఇంటి నుండి తనను బలవంతంగా బయటికి గెంటేసారని.. కోర్టు ఆదేశాలను సైతం పాటించకుండా పార్థసారధి రెడ్డి అనే వ్యక్తి బెదిరింపులకు దిగుతున్నాడని.. తెలియజేస్తున్నారు. న్యాయం తన వైపు ఉన్న పోలీసుల నుంచి సహకారం అందడం లేదని ఆ బాధితులు వాపోతున్నారు

ప్రజలనుంచి అర్జీలను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే పంతం నానాజీ.. ఈ సమస్యను కడప ఎస్పీ గారి దగ్గరికి తీసుకువెళ్లారు. బాధితులకు కూడా న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం పైన అటు ఎస్పీ కూడా సానుకూలంగానే స్పందించారు. యమలనూరు గ్రామానికి చెందిన జగనన్న కాలనీ లబ్ధిదారుల ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి సచివాలయ ఉద్యోగి సూచించినటువంటి ప్రైవేటు కాంట్రాక్టుకు డబ్బు కట్టి మోసపోయామని తెలియజేశారు. అప్పట్లో గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న సురేష్ వర్మ అనే వ్యక్తి ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున చెల్లించామంటూ తెలుపుతున్నారు. 120 మందికి పైగా ఆ వ్యక్తికి ఇవ్వగా ఒక ఇల్లు కూడా పూర్తి చేయలేదని బాధితులు వాపోతున్నారు. ఈ వ్యవహారాన్ని పంత నానాజీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారట.

బాధితులకు కచ్చితంగా న్యాయం చేయాలని సూచించారట. అలాగే డ్వాక్రా మహిళలు కూడా గత ప్రభుత్వంలో చాలా నష్టపోయామని కూడా తెలియజేశారని తెలిపారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని నానాజీ తెలియజేశారు.. అలాగే నరసరావుపేటకు చెందిన తురక పద్మావతి అనే మహిళ ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేసింది.. తన భర్త డ్యూటీలో చనిపోతే కారుణ్య నియామకం కింద తన కుమార్తెకు దక్కాల్సిన ఉద్యోగం రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ విషయాన్ని జనసేన కార్యాలయానికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే తిరుమల రాళ్ళకు చెందిన ప్రాంతంలో కూడా మరొక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు ఇలా ఇప్పటివరకు చాలామంది ఇవ్వడం జరిగిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: