సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి.. ఆమెను ఎలా ఓడించారు..??
• స్ట్రాంగ్ పొలిటీషియన్లపై గెలుపు సాధించిన నేతలు
• మమతా బెనర్జీ ఓడిపోవడంతో అందరూ షాక్
• సువేందు అధికారి గ్రేటెస్ట్ విన్ వెనక ఉన్న కారణం ఏంటి
(భారతదేశం - ఇండియాహెరాల్డ్)
2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 1,957 ఓట్ల తేడాతో అంతటి గొప్ప రాజకీయ నాయకురాలు ఓడిపోయారు. మిగతా చోట్ల ఆమె పార్టీయే తెరిచింది కానీ నందిగ్రామ్‌లో మాత్రం టీఎంసీ ఓటమి సాధించింది ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ ని ఓడించడం అంత సులభమైన పనేం కాదు. ముఖ్యంగా మమత ఎలాంటి డైనమిక్ లీడర్ ని ఓడించాలంటే చాలా స్ట్రాంగ్ లీడర్ అయి ఉండాలి. సువేందు అధికారి నందిగ్రామ్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు అందుకే ఆయన గెలవగలిగారు.
నిజానికి సువేందు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి కుడి భుజంగా ఉంటూ వచ్చారు. అతను 1998 నుంచి 2020 వరకు తృణమూల్ కాంగ్రెస్‌లో సభ్యుడుగా కొనసాగారు. మమత టీఎంసీ నాయకత్వాన్ని తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అప్పజెప్పడంతో సువేందు అధికారి చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంతేకాదు ఆ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ బాగా కోపం వ్యక్తం చేశారు అతడిని ఎలాగైనా ఓడించి రాజకీయంగా మట్టికరిపించాలని అనుకున్నారు. అందుకే 2021లో ఎన్నడూ లేని విధంగా నందిగ్రామ్‌లో పోటీ చేశారు. సువేందు ఆ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు.
మమత ఇక్కడ పోటీ చేస్తుందని ఆయన భయపడలేదు. ఆమెను ఓడించి బీజేపీ తరఫున ముఖ్యమంత్రి కావాలి అనుకున్నారు. శాపదాలు కూడా చేశారు భారీ ఓట్ల మెజారిటీతో గెలుస్తానని లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. అయితే ఆమెను ఓడించడం సక్సెస్ సాధించారు కానీ బెంగాల్ ముఖ్యమంత్రి మాత్రం కాలేకపోయారు
1984 లోక్‌సభ ఎన్నికల్లో సోమనాథ్ ఛటర్జీని ఓడించడం ద్వారామమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించిన తర్వాత, ఆమె 2007లో నందిగ్రామ్‌లో భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించారు, చివరికి 2011లో వామపక్షాలను పడగొట్టారు. ఆమె భబానీపూర్ నుంచి పోటీ చేస్తూ వచ్చారు, నందిగ్రామ్‌లో సువేందు అధికారి కుటుంబం బాగా పలుకుబడిని, ఆప్యాయతను సంపాదించింది.
అయినా మమతా నందిగ్రామ్‌లో సువేందుపై గెలవడానికి చాలా ప్రయత్నించింది. అతనికి ప్రజల్లో చాలా మద్దతు ఉందని ఆమె తెలుసు. దాదాపు 2.75 లక్షల మంది ఓటర్లు ఉన్న నందిగ్రామ్‌లో ప్రధానంగా హిందువులు ఉన్నారు. సువేందు మద్దతు కూడగట్టడానికి "జై శ్రీ రామ్" నినాదాలు, ఆలయ సందర్శనలను ఉపయోగించారు. చివరికి ఆయన గెలిచారు కానీ అది చాలా స్వల్ప మార్చిన మాత్రమే. కానీ అంత బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థిపై గెలవడం మాములు విషయం కాదు. ఒకవేళ ఓడిపోయి ఉంటే అతడి రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు పడుండేది.