ఏపీ: ఏపీలో కొత్త మద్యం పాలసీ.. అప్పటి నుంచే..!
అంతేకాదు అక్రమ వైద్యం నివారణ , డ్రగ్ కంట్రోల్ పై కూడా ఈ అధికారుల బృందం అధ్యయనం చేయనుంది. ట్రాక్ అండ్ ట్రేస్, డి అడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాల పైన దృష్టి సారించనున్నారు. ఆయా రాష్ట్రాలలోని అత్యుత్తమ విధానాలపై కూడా ప్రభుత్వానికి ఈ బృందాలు నివేదిక ఇవ్వనున్నాయి. ఆగస్టు 12వ తేదీలోగా ఈ బృందాలు నివేదికలు సమర్పించాలని నాలుగు అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత అన్ని అధ్యయనాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేస్తోందని సమాచారం.
ముఖ్యంగా రాష్ట్రంలో మద్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వతంగా పరిష్కరించడం కుదరదు కాబట్టి కొన్ని నియమాలతో కూడిన కొత్త అమలును తీసుకురానున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ప్రజలకు హాని కలగకుండా, ప్రభుత్వానికి ఆదాయం తగ్గకుండా పలు జాగ్రత్తలు తీసుకోబోతున్నారట.ఈ మేరకు పలు అంశాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం మద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లో అమల్లోకి రానుంది.