పొలిటికల్ జేయింట్ కిల్లర్స్: ఇద్దరు సీఎంలను ఓడించిన మొనగాడు ?
* ఇద్దరు సీఎంలను ఓడించిన వెంకటరమణ
* రేవంత్ కు మూడో స్థానమే
రాజకీయాలు పెద్ద సముద్రం. ఇందులో కొన్నిసార్లు గెలుస్తారు. మరి కొన్నిసార్లు ఓడుతారు. మన అనుకున్న వాడే వెన్నుపోటు పొడిస్తే చాన్స్ కూ డా ఉంటుంది. అయితే ఎన్టీఆర్, ఇందిరాగాంధీ లాంటి పెద్ద పెద్ద లీడర్లే ఓడిపోయారు. అయితే కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కూడా... మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. కామారెడ్డి లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఓటమి పాలయ్యారు.
2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో... కల్వకుంట్ల చంద్ర శేఖర రావు రెండు చోట్ల పోటీ చేశారు. అందు లో ఒకటి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ కాగా... మరొకటి కామారెడ్డి నియోజక వర్గం. అయితే... కెసిఆర్ కామారెడ్డి లో పోటీ చేసిన నేపథ్యంలో... కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి కూడా పోటీ చేశారు. అటు బిజెపి తరఫున.. సాధారణ మనిషి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి బరిలో నిలుచున్నారు.
దీంతో కేసీఆర్ విజయం అందరూ గాయం అనుకున్నారు. కానీ కేసీఆర్ రెండో స్థానంలో నిలిచి.. ఓడిపోయారు. దీంతో బిజెపి అభ్యర్థి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. రేవంత్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి వెంకటరమణ రెడ్డి, 6741 ఆదిక్యంతో విజయం సాధించారు.
గెలిచిన బిజెపి అభ్యర్థి వెంకటరమణ రెడ్డికి 66 వేల పైచిలుక ఓట్లు వచ్చాయి.తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు 60 వేల వరకు వచ్చాయి. ఇటు రేవంత్ రెడ్డికి 54,000 మాత్రమే వచ్చాయి. ఇలా... మాజీ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విజయం సాధించి వెంకటరమణారెడ్డి చరిత్ర సృష్టించారు. ఈ విజయంతో వెంకటరమణారెడ్డి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.