రేవంత్ ఫై ఈటెల విజయం.. సీఎం సీట్లో ఉన్న సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయాడు?

frame రేవంత్ ఫై ఈటెల విజయం.. సీఎం సీట్లో ఉన్న సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయాడు?

praveen
సాధారణంగా రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. రాజకీయ ఉద్దండులం అని చెప్పుకునే వాళ్ళు సైతం కొన్ని కొన్ని సార్లు అనూహ్యమైన రీతిలో  ఓటమిపాలవుతూ ఉంటారు. అయితే ఇలా ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొంతమంది ఓటమి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇలాంటి మాస్ లీడర్లు ఎలా ఓడిపోయారా అని ప్రజలందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఓటమిలలో రేవంత్ రెడ్డి పై అటు ఈటల రాజేందర్ సాధించిన గెలుపు కూడా ఒకటి అని చెప్పాలి.

 మొన్నటికి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం లో రేవంత్ రెడ్డి పై ఈటల రాజేందర్ విజయం సాధించారు. అదేంటి రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కానీ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయలేదు కదా.. అంటారా.. అయితే వాస్తవానికి అటు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగింది  పట్నం సునీత మహేందర్ రెడ్డి. కానీ అక్కడ పోరు మాత్రం ఈటల రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న విధంగానే సాగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అప్పటికే కంచుకోట అయినా కొడంగల్లో విజయం సాధించి సీఎం స్థానంలో ఉన్నారు. దానికి తోడు అటు మల్కాజ్గిరి నియోజకవర్గం లో అటు రేవంత్ కి సిట్టింగ్ స్థానం.

 పార్టీ ప్రతిష్టమైన స్థితిలో లేనప్పుడే మల్కాజ్గిరిలో విజయం సాధించిన రేవంత్ రెడ్డి.. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తాను సీఎం సీట్ లో ఉన్నప్పుడు ఇక మల్కాజిగిరిలో తప్పకుండా విజయం సాధించి తీరుతారు అని అందరూ అనుకున్నారు. ఈటల కాదు ఇంకెవరు వచ్చి పోటీ చేసిన ఇక్కడ కాంగ్రెస్ పార్టీది విజయమని.. ఈ విజయాన్ని రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అని రాజకీయ విశ్లేషకులు కూడా అనుకున్నారు. కానీ ఈటల రాజేందర్ మాత్రం తన రాజకీయ అనుభవాన్ని మొత్తం ఉపయోగించి మల్కాజిగిరిలో ఘనవిజయాన్ని సాధించారూ. అది కూడా అలాంటి ఇలాంటి విజయం కాదు.. మూడు లక్షల 87 వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో ఈటెల విజయాన్ని అందుకున్నాను. ఇలా మాస్ లీడర్ గా ఏకంగా సీఎం సీట్ లో ఉన్న రేవంత్ ని సైతం ఈటెల పరోక్షంగా ఓడించిన అది చివరికి ప్రత్యక్షంగా ఓడించినట్లుగానే మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: