సొంత పార్టీ కార్యకర్తలే జగన్ పై ఆగ్రహం.. కారణం.?
ముఖ్యంగా వైసిపి కార్యకర్తలు శుక్రవారం రోజున వివిధ ప్రాంతాల నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. గతంలో జగన్ సీఎం గా ఉన్నప్పటి లాగే ఇప్పుడు కూడా ముందస్తు అపాయింట్మెంట్ ఉన్న వారిని క్యాంపు కార్యాలయంలోకి అనుమతించారు. మిగతా కార్యకర్తలు బయటే వేచి ఉన్నారు. వారంతా కూడా పార్టీ కోసం పనిచేసిన వారే . కష్టాలను నష్టాలను ఎదుర్కొన్న వారే.. అయినా ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలెస్ లోకి రావడానికి కూడా అనుమతి లేదు. భద్రత పేరుతో ఇన్ని రోజులు సృష్టించిన వలయాలు అన్నింటిని తొలగించడంతో ఇప్పుడు ప్యాలెస్ గేట్ వరకు రాగలిగారు. అయినా భద్రతా సిబ్బంది వారిని లోపలకు రానివ్వకుండా దురుసుగా ప్రవర్తించడం పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. జగన్ భద్రత సిబ్బంది కార్యకర్తలపై ప్రవర్తించిన తీరు మండిపాటుకు గురి చేస్తుందని చెప్పవచ్చు.
జగన్ను కలవాలని కార్యకర్తలు గోల చేశారు. అందులో ఒక కార్యకర్త లోపల ఉన్న వారితో ఫోన్లో మాట్లాడిస్తాను.. అనుమతించమని ముందుకు వచ్చారు. దీంతో జగన్ భద్రతా సిబ్బందిలో ఒకరు అతడి సెల్ ఫోన్ లాక్కొని విసిరేశాడు. పార్టీ కోసం పనిచేసిన మాకు ఇంతటి ఘోర అవమానమా.? ఈ ఐదేళ్లు ఇలా వ్యవహరించారు కాబట్టే మనం ఓడిపోయాం. అయినా మనకు బుద్ధి రాదు అంటూ అక్కడున్న కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా" రావాలి జగన్.. మమ్మల్ని కలవాలి జగన్" అంటూ నినాదం చేస్తున్నారు కార్యకర్తలు. మరి ఇప్పటికైనా జగన్ బయటకొచ్చి వారిని కలుస్తారో లేదో తెలియాల్సి ఉంది.