ఏపీ: ప్రజలకు శుభవార్త.. ఆ పర్యాటక కేంద్రంలో ఎయిర్ పోర్ట్..!
ఫ్లైటెక్ ఏవియేషన్ సంస్థ శిక్షణ విమానాలను ఇక్కడి నుండే నడుపుతోంది. ఇక ప్రభుత్వం నిర్ణయంతో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ తాజాగా విజయపురి సౌత్ లో పర్యటించారు. అక్కడ ఫ్లైటెక్ ఏవియేషన్ సంస్థకు వెళ్లి యజమాని మమతాతో కూడా ఆయన మాట్లాడారు. అనంతరం ఆ సమీపంలో ఉన్న భూములను పరిశీలించి విమానాశ్రయ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలిపారు. ఇక నాగార్జున సాగర్ వద్ద విమానాశ్రయ నిర్మాణంతో రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే నాగార్జునసాగర్ అతిపెద్ద పర్యాటక కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. ఇక్కడికి చాలామంది ప్రజలు, పర్యాటకులు వచ్చి సందర్శిస్తున్నారు. ఇలాంటి ప్రదేశాలలో ఎయిర్ పోర్ట్ లు నిర్మిస్తే అక్కడ యువతకు , కార్మికులకు కూడా పని దొరుకుతుంది
ఇక రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో నిర్మితమయ్యే ఎయిర్ పోర్ట్ రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య ఉండడంతో పాటు రెండు రాష్ట్రాలు మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఇలా అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఇక్కడ ఇంకో ఎయిర్ పోర్టును నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఇక్కడ విమానాశ్రయ పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..