బుద్దా వెంకన్న: చంద్రబాబుపై తిరుగుబాటు..?

frame బుద్దా వెంకన్న: చంద్రబాబుపై తిరుగుబాటు..?

Veldandi Saikiran

టీడీపీ పార్టీపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.  మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా ఎంపి కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలు అయిన సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడారు. పదవి లేక పోవడంతో ప్రజలకు, నన్ను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేక పోతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ ల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యే ల మాట నెగ్గిందని... ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐ లుగా నియమించారని తెలిపారు బుద్దా. నా మాట చెల్లలేదు...దీంతో ఆవేదన గా ఉందన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.
ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇతరుల మీద ఆధారపడ్డనని.... ఇంకా నన్ను నమ్ముకున్న వారికి నేనేమీ చేస్తాను...నన్ను కార్యకర్తలు క్షమించాలని కోరారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. 2024 ఎన్నికల సందర్భంలో రక్తంతో చంద్రబాబు నాయుడు  చిత్ర పటం కాళ్ళు కడిగానని గుర్తు చేశారు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా బాధపడలేదని వెల్లడించారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు జోగి రమేష్ వెళితే నేను వెళ్లి అడ్డుకుని నిలబడ్డానన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.
ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు అప్పుడు వచ్చారో చెప్పాలని కోరారు. ఐదేళ్ల వైసిపి దుర్మార్గపు పాలనలో అనేక పోరాటాలు చేశానని... వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడానని వెల్లడించారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. నా మీద మొత్తం 37 కేసులు పెట్టారని... 37 కేసులు టిడిపి పార్టీ కోసమే నేను పెట్టించుకున్నానని తెలిపారు.
టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు న్యాయం జరగలేదని భావిస్తున్నా... ఈ మాట ఆవేదనతోనే చెబుతున్న తప్ప వ్యతిరేకతతో కాదన్నారు. గత ఎన్నికల్లో ఎంతోమంది పోరాటం చేసి, ఎదురు తిరిగి టిడిపిలో టికెట్లు పొందారని వెల్లడించారు. నాకు టికెట్ ఇవ్వకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశానని వివరించారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: