పొలిటికల్ ప్రేమలు: కొండా మురళి సురేఖ కాలేజీ ప్రేమలో ఎన్నో మలుపులు.!
- చదువుకునే సమయంలోనే చిగురించిన ప్రేమ..
- చాటు మాటు చూపులు కలిసిన మనసులు..
- కొండ మురళి సురేఖ ప్రేమలో ఎన్నో మలుపులు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి కొండా సురేఖ దంపతులు అంటే తెలియని వారు ఉండరు. రాజకీయాల్లో రాటు తేలిన ఈ ఇద్దరు భార్యాభర్తలు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. చివరికి అన్నింటిని అధిరోహించి రాష్ట్రస్థాయిలో మంత్రి పీఠాన్ని చేపట్టగలిగారు. కొండా సురేఖ కొండా మురళి ప్రేమ వల్లే ఇంతటి స్థాయికి వచ్చానని ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. ఇలాంటి వీరి మధ్య పుట్టినటువంటి కాలేజీ ప్రేమ ఎలా నడిచింది..వీరి మధ్య జరిగినటువంటి చిలిపి సన్నివేశాలు ఏంటి అనే వివరాలు చూద్దాం.
కొండా మురళి సురేఖ :
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈమె తిరుగులేని రాజకీయ నాయకురాలిగా ఎదిగారు. అలాంటి కొండా మురళి సురేఖ ప్రేమలో ఎన్నో ఆటుపోట్లు చిలిపి పనులు ఉన్నాయి. కొండా సురేఖ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే కొండా మురళి ఆమెను వెంబడించేవారట. ప్రతిరోజు ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి వెనుక ఫాలో అవుతూ అలా చూస్తూ ఉండేవారట. కానీ సురేఖ కొన్నాళ్లపాటు కొండా మురళిని అస్సలు పట్టించుకునేది కాదట. దీనికి ప్రధాన కారణం కొండా సురేఖ బ్యాచ్ లో పది మందికి పైగా అమ్మాయిలు కలిసి వెళ్లేవారట. కానీ మురళి ఒక నలుగురి ఫ్రెండ్స్ తో కలిసివచ్చే వారట. కానీ ఆయన ఎవరిని వెంబడిస్తున్నారు అనేది అర్థం కాలేదట.అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత కొండా సురేఖ ఉండే ఇంటి వైపు కూడా మురళి తరచూ తన హెజ్డి బండి వేసుకొని వెళ్తూ అలా చూసేవారట. అలా ఇద్దరి మధ్య చూపులు చూపులు కలిసి చివరికి ప్రేమకు దారితీసిందట. అలా కొండా సురేఖ కాలేజ్ అయిపోయాక బస్సులో వెళుతుంటే ఆ బస్సు వెంబడించి కొండా మురళి ఫాలో అయ్యేవరట.