బ్రిటన్లోనూ ఇలాంటి దారుణాలా?
బ్రిటన్ లోని సౌత్ పోర్టు నగరంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు బాలికలను చంపినందుకు నిరసనగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సదంర్భంగా పెద్ద సంఖ్యంలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు, యువకులపై 17 ఏళ్ల యువకుడు కత్తితో దాడి చేశాడు. ఇందులో ముగ్గురు బాలికలు మృతి చెందారు. మరో ఐదుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
అక్కడి మీడియా నివేదిక ప్రకారం.. దాడి చేసిన యువకుడు ముస్లిం మతానికి చెందిన వాడని తెలిసింది. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు గుమగూడి మసీదుపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఆందోళనకారులు పోలీసుల వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు దహన ఘటనలకు పాల్పడ్డారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు మా దేశం తిరిగి కావాలంటూ నినాదాలు చేయడం గమనార్హం. సౌత్ పోర్టులో జరిగిన హింస కాండపై బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్ మర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలికలను హత్య చేసిన నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. నిందితుడి దాడిని ఉగ్రవాద ఘటనగా పరిగణించేందుకు బ్రిటన్ పోలీసులు నిరాకరించారు. ప్రస్తుతం అక్కడ వేసవి సెలవులు కావడంతో సౌత్ పోర్టులో ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ వర్క్ షాప్ నిర్వహించారు. దీనికి హాజరైన బాలికలు, యువకులపై దుండగుడు దాడి చేశాడు.