శశి థరూర్ మంచి ప్లేయరే.. ఇద్దరిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారుగా..

frame శశి థరూర్ మంచి ప్లేయరే.. ఇద్దరిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారుగా..

Suma Kallamadi

* అందరినీ ఆకర్షిస్తున్న పొలిటీషియన్ల లవ్ స్టోరీస్‌
* రెండు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న శశి థరూర్
* లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నారు కానీ
( భారత దేశం- ఇండియా హెరాల్డ్)
ప్రముఖ భారతీయ రాజకీయవేత్త శశి థరూర్ చాలా రొమాంటిక్ పర్సన్ అంటారు. థరూర్ కు ఒక లవ్ స్టోరీ కూడా ఉంది. ఆయన పారిశ్రామికవేత్త సునంద పుష్కర్ ను గాఢంగా ప్రేమించారు పెళ్లి కూడా చేసుకున్నారు దురదృష్టవశాత్తు ఈ పెళ్లి ట్రాజడీగా మిగిలిపోయింది. 2009, అక్టోబర్‌లో, బిలియనీర్ సన్నీ వర్కీ ఏర్పాటు చేసిన పార్టీలో శశి థరూర్‌ను సునంద కలిశారు. నటి పరిచయంలోనే థరూర్ ఆమెను చాలా ఇంప్రెస్ చేశారు. కొద్ది రోజుల్లోనే వారి సంబంధం రొమాంటిక్ రిలేషన్‌షిప్ గా మారింది. థరూర్, సునంద 2010, ఆగస్టులో కేరళలోని పాలక్కాడ్‌లో సంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది మూడో పెళ్లి.
వారి వివాహం, ప్రారంభంలో ఆనందంగా సాగింది ఒకరికొకరు ఎప్పుడూ అండగా నిలుచుకునేవారు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకునేవారు. అయితే వీరి మ్యారేజ్ లైఫ్ లో కాలక్రమేణా ఇబ్బందులు ఎదురవడం మొదలయ్యింది. సునంద దుబాయ్, ఢిల్లీ మధ్య ఎక్కువగా తిరుగుతూ ఉండేది. అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం పర్యటనలు చేసేది. తర్వాత థరూర్, పుష్కర్ ఇద్దరూ సోషల్ మీడియాలో తమ మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు వెల్లడించారు.
థరూర్‌ పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్‌తో అఫైర్ పెట్టుకున్నారని సునంద షాకింగ్ అలిగేషన్స్ చేశారు. దీని తర్వాత వారి మధ్య గ్యాప్ చాలా పెరిగిపోయింది. వాళ్లు ట్విట్టర్‌లో చాలా పబ్లిక్, వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకున్నారు. దారితీసింది, విషాదకరంగా 2014, జనవరిలో సునంద పుష్కర్ ఢిల్లీలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించారు. ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు కలిగాయి. చివరికి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా దర్యాప్తు తేల్చింది.
* అంతకుముందు శశి థరూర్‌ లవ్ మ్యారేజెస్
శశి మొదటగా తిలోత్తమ ముఖర్జీని చేసుకున్నారు. ఆమెతో కలిసి ఇషాన్, కనిష్క్ అనే ఇద్దరు కుమారులకు తండ్రి అయ్యారు. కెనడియన్ అమ్మాయి అయిన క్రిస్టా గైల్స్‌ను కూడా శశి గాఢంగా ప్రేమించారు. ఆమెను పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ వీళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. మొత్తం మీద శశి థరూర్‌ లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: