బీజేపీతో కలిసి జగన్ మాస్టర్‌ ప్లాన్‌..?

frame బీజేపీతో కలిసి జగన్ మాస్టర్‌ ప్లాన్‌..?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు శరావేగంగా మారిపోతున్నాయి. గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టిన పరిస్థితులను నెమరు వేసుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వం... అదే స్థాయిలో రివెంజ్ తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే.. జగన్మోహన్ రెడ్డి తో పాటు పలుగురు నేతలపై కేసులు వేసి...చాలా ఇబ్బందులు పెడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. విజయ్ సాయి రెడ్డి లాంటి నేతలపై అక్రమ సంబంధం ఘటన తెరపైకి తీసుకువచ్చింది టిడిపి నే.
అయితే ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి... రివర్స్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే వైసిపి నేతలను...  కేంద్ర బిజెపి పెద్దల వద్దకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇందులో భాగంగానే వైసీపీలో నెంబర్ 2 గా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి తాజాగా ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో... చర్చలు చేశారు విజయసాయి రెడ్డి.

వాస్తవానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వరు. కానీ విజయసాయి రెడ్డికి మాత్రం అపాయింట్మెంట్ ఇచ్చారు అమిత్ షా. అయితే...  వైసిపి నేతలను కావాలనే ఢిల్లీకి జగన్ పంపిస్తున్నారట. ఇక్కడే ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు... వైసీపీ ఎంపీలను కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని ఈ ప్రచారం జరుగుతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి రివర్స్ ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు.

బిజెపి పార్టీలోకి వైసిపి నేత  నేతలు వెళ్లేలా  జగన్మోహన్ రెడ్డికి చూస్తున్నారట. ఎలాగైనా రాజ్యసభ సభ్యులు... వైసీపీ పార్టీలో ఉండే పరిస్థితి లేకపోవడంతో... ఈ విధంగా బిజెపికి దగ్గరవుతున్నారట జగన్ మోహన్ రెడ్డి. రాజ్యసభలో బిజెపికి బలం కావాలి.  ఇప్పుడు ఆ బలాన్ని.. నేను ఇస్తున్న అని విజయ్ సాయి రెడ్డి ద్వారా అమిత్ షాకు సంకేతం పంపారట జగన్. ఇలా చేస్తే కేంద్ర ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఉంటాయని... కొత్త చర్చ జరుగుతోంది. దానివల్ల చంద్రబాబు ప్రభుత్వం... వల్ల తనకు ఎలాంటి ఇబ్బందులు రావని అనుకుంటున్నారట. అంటే త్వరలోనే వైసీపీ రాజ్యసభ సభ్యులు...బీజేపీలోకి వెళ్లబోతున్నారన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: