ఏపీ: రేషన్ విషయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాటిని రద్దు చేస్తూ..!
అయితే ప్రజలకు కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ. ఆ ఎండియు వాహనాలు కూడా వైసీపీ కార్యకర్తలవే అనే అంతగా కూటమినేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి ప్రభుత్వం తీసుకు వచ్చినటువంటి ఈ పథకం పైన దృష్టి పెట్టి ఇక మీదట వాహనాల ద్వారా ఇంటింటా రేషన్ పంపే విధానాన్ని ఆపివేశారు ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ కూడా తెలియజేశారు. ఈ వాహనాల వల్ల ప్రభుత్వానికి ఎలాంటి లాభం లేదని నష్టాలే ఉన్నాయంటూ తెలియజేశారు.
ఇంటింటికి రేషన్ పంపించడం వల్ల నష్టం జరుగుతున్నట్లుగా తెలియజేశారు. గత ప్రభుత్వంలో 9,260 వాహనాలను కొత్తవి కొనుగోలు చేసి డోర్ టు డోర్ రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసేలా ప్లాన్ చేసినప్పటికీ అందులో విఫలమయ్యారని తెలిపారు.. దాదాపుగా ఈ పథకానికి 18,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. అయితే ఈ వాహనాలను కూడా కొంతమంది వైసీపీ నేతలు అక్రమంగా బియ్యాన్ని తరలించేందుకు ఉపయోగించుకుంటున్నారనే విధంగా మంత్రి నాదెండ్ల మనోహర్ చంద్రబాబుకు సైతం వివరించారట. దీంతో సీఎం రేషన్ డీలర్ల వద్దని ప్రజలు రేషన్ను వినియోగించుకునేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలియజేసినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఇంటింటా రేషన్ పథకం ఇక స్వస్తి పలికినట్టే అని చెప్పవచ్చు.