ఏపీ: ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నాదెండ్ల మనోహర్..!

Divya
కూటమిలో భాగంగా జనసేన పార్టీ నుంచి మంత్రి పదవి అందుకున్న నాదెండ్ల మనోహర్.. మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా తన పని తాను చేసుకుంటూ ప్రజలను బాగా పేరు సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా రేషన్ విషయంలో కూడా ఔకతవకలు జరిగిన షాపుల పైన, గోడౌన్ల పైన కూడా ఎన్నోసార్లు ఎన్నో ప్రాంతాలలో చెకింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజవర్గంలో పర్యటించినట్లుగా తెలుస్తోంది. అక్కడ కొన్ని ప్రాంతాల నిర్మిస్తున్న కాలనీలను కూడా పరిశీలించారు.

పేదల కోసం లేఅవుట్లను అక్కడ ఇళ్ల స్థలాలను పరిశీలించినట్లు తెలుస్తోంది నాదెండ్ల మనోహర్. ముఖ్యంగా అధికారులను లబ్ధిదారులను మరి అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు, గృహ నిర్మాణంలో అవినీతి జరిగినట్లుగా ఆయన దృష్టికి వచ్చిందని తెలియజేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పేదల కోసం కేటాయించిన భూములు ఇల్ల విషయంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే ఏ ఒక్కరిని వదిలిపెట్టమంటూ తెలియజేశారు.

సమగ్ర విచారణ జరిపించి ఖచ్చితంగా బాధితులను సైతం శిక్షిస్తామంటూ తెలిపారు.లబ్ధిదారుల నుంచి ఎవరైనా డబ్బులు తీసుకొని  పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లకు కూడా మరో రెండు వారాలు గడువు ఇస్తామని పనులు మొదలు పెట్టకపోతే కచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ తెలియజేశారు. లబ్ధిదారులు కూడా తమకు మంజూరైన స్థలం ఎక్కడ ఉందో తెలియదని చాలామంది తెలియజేస్తున్నారు అంటూ మనోహర్ వెల్లడిస్తున్నారు. అలాగే లబ్ధిదారులకు వారి యొక్క స్థలాలు తెలిపే విధంగా బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. గృహ నిర్మాణ శాఖ నుంచి లబ్ధిదారులకు రావాల్సిన బకాయిలు మొత్తం కూడా మరొక ఏడు రోజులలో విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మెరకే ఇలా నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని కూడా పెంచుతామంటూ తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: