రివేంజ్ పాలిటిక్స్: ఇక నేతలు మారరా..కార్యకర్తలు బలవ్వాల్సిందేనా..?

frame రివేంజ్ పాలిటిక్స్: ఇక నేతలు మారరా..కార్యకర్తలు బలవ్వాల్సిందేనా..?

Divya
•కక్ష సాధింపులే లక్ష్యంగా ముందడుగు
•భయాందోళనలలో ప్రజలు
•నాయకుల రివేంజ్ పాలిటిక్స్,  బలవుతున్న కార్యకర్తలు..

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

ప్రస్తుతం గత రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్లో రివేంజ్ పాలిటిక్స్ అటు ప్రజలను ఇటు కార్యకర్తలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గతంలో కనివిని ఎరుగని రీతిలో కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉండడంతో ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజానికి 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఎన్నో మంచి పనులు చేపట్టింది.ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడింది.పిల్లలను నూటికి నూరు శాతం స్కూళ్లకు పంపించే క్రమంలో వారికి ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు భారం పడకుండా పిల్లల చదువుకు పాటుపడింది.
సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు తమ సొంత ఊర్లోనే సమస్యలు సాల్వ్ అయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఇలా ఎన్నో మంచి పనులు చేసింది వైసిపి ప్రభుత్వం . అయితే ఈసారి నువ్వా నేనా అన్న పోరులో 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది . గతంలో తమను హింసించారు అంటూ ఇప్పుడు రివేంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది కూటమి. ముఖ్యంగా టిడిపి ప్రభుత్వం.. ఉన్న ప్రభుత్వ భవనాలను ఉపయోగించుకోకుండా వాటిని కూల్చివేస్తూ విచక్షణ రహితంగా ప్రవర్తిస్తోందనే అనుమానాలు  ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే సచివాలయాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ డబ్బులు ప్రజల నుంచి వచ్చినవే.  అయితే ఇప్పుడు వాటిని అన్నా కాంటీన్లు గా ఉపయోగిస్తామని , మరికొన్ని చోట్ల ఏకంగా కొన్నింటిని కూల్చివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా చేయడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
పైగా కక్ష సాధింపుల్లో భాగంగా చాలామంది అటు టిడిపి ఇటు వైసిపి ఎవరికి వారు దాడులు చేసుకుంటూ హతమార్చుకుంటున్న సందర్భాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి  ఇకపోతే నాయకుల కక్ష సాధింపుల కోసం వారి కార్యకర్తలు బలవుతున్నారని గుర్తించలేకపోతున్నారు. టిడిపి వైసిపి ఇద్దరు కూడా పోటాపోటీగా పోటీ పడుతూ ఏకంగా మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కనీసం ఇకనైనా మారాలి అని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అడుగులు వేయాలని,  రివేంజ్ పాలిటిక్స్ కి దూరంగా ఉండాలని ఓటర్లు కోరుకుంటున్నారు. మరి ఇకనైనా కూటమి, వైసిపి మారి రాష్ట్రం అభివృద్ధికి తమ వంతు పాటుపడతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: