వైసీపీని తట్టుకోవడం టీడీపీ వల్ల కావడం లేదా...నేతలు భయపడుతున్నారా?
అయితే ఓటమి బాధలో ఉన్న వైసిపి పార్టీ... ఈ స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీని దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో వైసిపి పార్టీ గెలిస్తే మళ్ళీ ఒక ఊపు వస్తుంది. అందుకే ఈ ఉప ఎన్నిక తెలుగుదేశం కూటమి కంటే వైసీపీకి చాలా కీలకంగా మారింది. ఇందులో భాగంగానే ఇప్పటికే అభ్యర్థిని కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
విశాఖ ఎమ్మెల్సీ సీటుకు వైసీపీ అధిష్టానం... బొత్స సత్యనారాయణ పేరును ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. మన ఎన్నికల్లో బొత్స కుటుంబం దారుణంగా ఓడిపోయింది. అయితే అనూహ్యంగా మళ్ళీ... బొత్స సత్యనారాయణ కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇది సరికొత్త వ్యూహం అని కొంతమంది అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన కత్తి మీద సాములాగా తయారైందని అంటున్నారు.
వైసిపి నుంచి ఇటీవల టిడిపిలోకి వచ్చిన నేతల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలని టిడిపి అనుకుంటున్నాట్లు సమాచారం అందుతోంది. వాళ్లే కాకుండా చాలా మంది నేతలు ఈ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు దగ్గర మొరపెట్టుకుంటున్నారట. టికెట్ ఇవ్వడంలో... చంద్రబాబు నాయుడు టీం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందట. ఎవరో ఒకరికి ఇవ్వడం వల్ల.. ఎన్నికల్లో టిడిపి కూటమి అభ్యర్థి ఓడి పోతే... వైసిపి గెలుపును తట్టుకోవడం కష్టమని చంద్రబాబు అనుకుంటున్నారట. అందుకే చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారట చంద్రబాబు.