మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే.. రేషన్ కార్డు బంద్..!

Divya
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం పొందాలి అన్నా కూడా కచ్చితంగా రేషన్ కార్డ్ కీలకమని చెప్పవచ్చు.. నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించాలి అన్న కూడా ఇది ఉండాల్సిందే.. దారిద్య రేఖకు దిగువన ఉన్నవారికి ఈ రేషన్ కార్డును అందిస్తూ ఉన్నది ప్రభుత్వం. అయితే జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారమే.. కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలనుకునే వారికి నిర్దిష్ట అర్హతలను తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. వాటి గురించి చూద్దాం.

కుటుంబంలో ఎవరైనా వ్యక్తికి ఫ్లాటు లేదా ఇల్లుతో సహా 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఇల్లు అంటే రేషన్ కార్డు కోసం వారు అనర్హులు. అలాగే కారు ఉన్నా కూడా రేషన్ కార్డు పొందేకి అనార్హులు. ఏసీ ఉన్న వారు కూడా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులట. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్న ప్రభుత్వం ద్వారా పింఛన్ పొందుతున్న వారికి కూడా రేషన్ కార్డు ఉండదట. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాలలో రెండు లక్షలు నగరాలను మూడు లక్షల రూపాయల లోపు మాత్రమే ఉండాలి ఇలాంటి వారికి రేషన్ కార్డు అర్హత.

అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆదాయ పన్ను చెల్లించేవారు కూడా రేషన్ కార్డుకి అనర్హులు.. లైసెన్స్ ఉన్నటువంటి ఆయుధాలు కలిగి ఉన్న వారు కూడా ఈ రేషన్ కార్డుకి అర్హులే.. ఎవరైనా సరే తప్పుడు పత్రాలను చూపించి రేషన్ కార్డు పొందితే వారికి జరిమానా తో పాటు ఏదైనా శిక్ష విధించవచ్చు. అందుకే ఇలాంటి వారు వెంటనే రేషన్ కార్డును ప్రభుత్వానికి సరెండర్ మంచిది. ఒక వేళ మీకు రేషన్ కార్డు ఉన్నప్పటికీ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే.. చట్టరీత్య ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రాలలో మరి కొన్ని నియమాలు కూడా ఉన్నవి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: