అన్న క్యాంటీన్ల పై సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన !
పని చేయకుంటే గ్యారెంటీ లేదని...ప్రజల కోసం పని చేయాలనుకుంటే కలెక్టర్లకే చాలా చక్కటి అవకాశం అని గుర్తు చేశారు చంద్రబాబు. బెస్ట్ కలెక్టర్ అనిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విభజన కంటే ఎక్కువ నష్టం గత ఐదేళ్ల పాలనలో ఏపీకి జరిగిందని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో 50 శాతం ఫిర్యాదులు భూ సమస్యలే ఉన్నాయన్నారు. రీ-సర్వేను హోల్డులో పెట్టామని.... సర్వే రాళ్లను గెలాక్సీ గ్రానైట్ రాళ్లతో వేశారని జగన్ సర్కార్ పై మండిపడ్డారు.
తన ఫొటో వేసుకోవడం కోసం గెలాక్సీ గ్రానైట్ రాళ్లు వేశారని.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. సంపద సృష్టికి కొత్త విధానాలు అవలంభించాలని కోరారు. ఐదేళ్లల్లో రూ. 1.64 లక్షల కోట్ల మేర పెన్షన్లు ఇవ్వబోతున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు. పేదల సేవలో అనే కార్యక్రమం కింద కలెక్టర్లు, అధికారులు పేదలతో మమేకం కావాల నికోరారు.
జీరో పావర్టీ అనేది ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు. పీ-4 విధానం అమలు చేయాలని... రూల్ బౌండెడ్ కాకుండా మానవతా ధృక్ఫధంతో ఆలోచించాలని కోరారు. సహచరులతో సౌమ్యంగా ఉండండి.. పెత్తందారీ పోకడలతో పోవద్దు అన్నారు సీఎం చంద్రబాబు. కలెక్టర్ల పనితీరు.. ప్రభుత్వం మీద పడుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని.... ప్రజా ప్రతినిధులను గౌరవించాలని పేర్కొన్నారు.