వాలంటీర్ వ్యవస్థకు పూర్తిగా గుడ్ బై.. చివరికి ఏం చేస్తారు..??

frame వాలంటీర్ వ్యవస్థకు పూర్తిగా గుడ్ బై.. చివరికి ఏం చేస్తారు..??

Suma Kallamadi

టీడీపీ కూటమి అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడుతోంది. ఆరు గ్యారెంటీలు నెరవేరుస్తామని చెప్పి టీడీపీ ఏపీ ప్రజల ఓట్లను గెలుచుకుంది. అందులో వాలంటీర్లకు పదివేల గౌరవ వేతనం ఇస్తామని కూడా తెలిపింది. కానీ ఇప్పుడు ఖజానా చూస్తే భయమేస్తుందని, ఎన్నో హామీలు ఇచ్చాము కానీ వాటిని అమలు చేసే పరిస్థితి లేదంటూ ప్రస్తుత సీఎం బాబు చేతులు ఎత్తేసారు. దీంతో పోయాం మోసం అంటూ ఏపీ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
ఏపీ ప్రజలకంటే ఏపీ వాలంటీర్లు బాగా నష్టపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే రూ.10,000 జీతం వారికి అందిస్తామని చంద్రబాబు చెప్పి ఇప్పుడు అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థకు పూర్తిగా గుడ్ బై చెప్పే కార్యక్రమం ప్రారంభమైంది. రెండు నెలల నుంచి వాలంటీర్లు లేకుండానే పెన్షన్లు పంపిణీ అనేది జరుగుతోంది. వందమందిలో కేవలం 30 శాతం మందికి మాత్రమే పెన్షన్లు ఇంటికి చేరుతున్నాయి. మిగతా వారందరూ కూడా సచివాలయాలకి, ప్రభుత్వ ఆఫీసుల ముందు క్యూలో నిలుచుని పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందే అన్ని ప్రభుత్వ సంక్షేమలు దాదాపు ఆగిపోయాయి. ప్రభుత్వ పాఠశాల నిర్వహణలో వాలంటీర్ల పాత్ర లేకుండా పోయింది. అంటే ఇంతకు ముందు వాలంటీర్లు చదువుకోని పిల్లలను స్కూల్ కి తీసుకెళ్లేవారు కానీ ఇప్పుడా అధికారం వాలంటీర్లకు లేకుండా చేశారు. ఇంతకుముందు వాలంటీర్ల కోసం టెలిగ్రామ్, వాట్సాప్ వంటి గ్రూప్స్ ఉండేవి. వీటి ద్వారా చాలా సమస్యలను దృష్టికి తెచ్చేవారు అలాగే ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే తాము అందజేస్తామంటూ తెలిపేవారు అన్ని సర్వీసుల గురించి ప్రజలకు అప్‌డేట్ చేసేవారు.
కానీ ఇప్పుడు ఆ గ్రూప్స్ అన్నీ కూడా డిలీట్ చేయమన్నారు. ఒక ఆర్డర్ కూడా జారీ చేశారు దీనివల్ల ఆ గ్రూప్స్ డిలీట్ చేయక తప్పలేదు దీంతో ప్రజలకు వాలంటీర్లకు మధ్య కమ్యూనికేషన్ అనేది తెగిపోయింది. ఆ విధంగా వాలంటీర్ వ్యవస్థ కొన్ని కిలో లేకుండా పోతోంది. వాలంటీర్ అనే పదం వాడకుండా వేరే పథకం ద్వారా కార్యకర్తలతో ప్రజలకు సేవలు అందించే కార్యక్రమం చేపట్టవచ్చని పొలిటికల్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: